చెన్నై సహా నాలుగు జిల్లాల్లో వాహన విక్రయాలపై నిషేధం
ABN, First Publish Date - 2020-06-18T15:24:29+05:30
చెన్నై సహా నాలుగు జిల్లాల్లో వాహన విక్రయాలపై నిషేధం
చెన్నై: తమిళనాడులో కరోనా అధికంగా ఉన్న నాలుగు జిల్లాల్లో వాహనాల విక్రయాలపై నిషేధం విధించినట్టు రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ తెన్‌కాశి జవహర్ తెలిపారు. చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో కరోనా వైరస్ తాకిడి ఎక్కువగా ఉండడంతో శుక్రవారం నుంచి 30వ తేదీ వరకు సంపూర్ణ కర్ఫ్యూ అమలుకు రానుంది. దీంతో ఈ నాలుగు జిల్లాల్లో వాహన విక్రయాలతో పాటు అన్నిరకాల రిజిస్ట్రేషన్ పనులను రద్దుచేస్తున్నారు. ఆర్టీఓ, రవాణా శాఖ కార్యాలయాలు 33 శాతం మంది ఉద్యోగులతో, షిఫ్టు విధానంలో పనిచేస్తారని కమిషనర్ తెలిపారు.
Updated Date - 2020-06-18T15:24:29+05:30 IST