పొల్యూషన్ సర్టిఫికెట్ ఉంటేనే వాహన బీమా
ABN, First Publish Date - 2020-08-22T08:27:20+05:30
న్యూఢిల్లీ, ఆగస్టు 21: మోటార్ బీమా పాలసీలను రెన్యువల్ చేసే సమయం లో పాలసీదారుల నుంచి చెల్లుబాటులో ఉన్న పొల్యూషన్ అండర్ కంట్రోల్ (
బీమా కంపెనీలకు ఐఆర్‌డీఏఐ ఆదేశం
న్యూఢిల్లీ, ఆగస్టు 21: మోటార్ బీమా పాలసీలను రెన్యువల్ చేసే సమయం లో పాలసీదారుల నుంచి చెల్లుబాటులో ఉన్న పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్‌ను కోరాలని సాధారణ బీమా కంపెనీలను బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ తాజాగా ఆదేశించింది. ఈ మేరకు ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది.
చెల్లుబాటులో ఉన్న పీయూసీ సర్టిఫికెట్ లేనట్టయితే బీమా పాలసీని రెన్యువల్ చేయవద్దని ఇంతకు ముందు సుప్రీం కోర్టు బీమా కంపెనీల కు ఆదేశాలు జారీ చేసింది. అయితే దీని అమలు మాత్రం జరగడం లేదని తెలుస్తోంది. కాగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో సుప్రీం కోర్టు ఆదేశాల అమలు స్థాయి పట్ల కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ఆందోళన వ్యక్తం చేసినట్టు ఐఆర్‌డీఏఐ పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ రీజియన్‌ను దృష్టిలో ఉంచుకునిబీమా రెన్యువల్ సమయంలో పీయూసీ సర్టిఫికెట్ ఉండాలన్న సుప్రీం ఆదేశాలు పాటించేలా చూడాలని బీమా కంపెనీలకు ఐఆర్‌డీఏఐ తెలియజేసింది.
Updated Date - 2020-08-22T08:27:20+05:30 IST