ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా ఆరోగ్యం క్షీణిస్తోంది.. బెయిలివ్వండి

ABN, First Publish Date - 2020-07-14T07:01:39+05:30

భీమా-కోరేగావ్‌ కేసులో నిందితుడైన ప్రముఖ కవి వరవరరావు(79) తాత్కాలిక బెయిలు కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని, దానికితోడు కొవిడ్‌ మహమ్మారి వ్యాపించిన నేపథ్యంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మెడికల్‌ రికార్డులు వెల్లడించాలి
  • బాంబే హైకోర్టులో వరవరరావు 2 వ్యాజ్యాలు
  • ఈ వారమే విచారణకు రావచ్చు

ముంబై, జూలై 13: భీమా-కోరేగావ్‌ కేసులో నిందితుడైన ప్రముఖ కవి వరవరరావు(79) తాత్కాలిక బెయిలు కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని, దానికితోడు కొవిడ్‌ మహమ్మారి వ్యాపించిన నేపథ్యంలో తనకు తాత్కాలిక బెయిలు మంజూరు చేయాల్సిందిగా ఆయన కోరారు. వరవరరావు తరఫున ఆయన న్యాయవాది ఆర్‌ సత్యనారాయణ్‌ అయ్యర్‌ హైకోర్టులో సోమవారం రెండు వ్యాజ్యాలు దాఖలు చేశారు. తన బెయిలు వ్యాజ్యాన్ని తిరస్కరిస్తూ ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు జూన్‌ 26న ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఒక పిటిషన్‌, తన మెడికల్‌ రికార్డులను కోర్టుకు సమర్పించాల్సిందిగా తలోజా జైలు అధికారులను ఆదేశించాలని కోరుతూ మరో పిటిషన్‌ వేశారు. ఈ వ్యాజ్యాలు ఈ వారంలోనే విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా, 90 రోజులలోగా ఎన్‌ఐఏ చార్జిషీటు దాఖలు చేయనందున తనను బెయిలుపై విడుదల చేయాలని కోరుతూ మరో నిందితుడు ఆనంద్‌ తెల్‌తుంబ్డే సోమవారం ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు.  


Updated Date - 2020-07-14T07:01:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising