ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరవరరావుకు బెయిల్‌ నిరాకరణ

ABN, First Publish Date - 2020-11-13T09:05:33+05:30

భీమా కోరేగావ్‌ కేసులో అరెస్టయి జైలులో ఉంటున్న విప్లవ కవి వరవరరావుకు ముంబై హైకోర్టు బెయిల్‌ నిరాకరించింది. ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణిస్తోందని, మెరుగైన చికిత్స కోసం నానావతి ఆస్పత్రికి తరలించాలని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై, నవంబరు 12: భీమా కోరేగావ్‌ కేసులో అరెస్టయి జైలులో ఉంటున్న విప్లవ కవి వరవరరావుకు ముంబై హైకోర్టు బెయిల్‌ నిరాకరించింది. ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణిస్తోందని, మెరుగైన చికిత్స కోసం నానావతి ఆస్పత్రికి తరలించాలని, వైద్యం అందించేందుకు స్వతంత్ర మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేయాలని, వరవరరావును బెయిల్‌పై విడుదల చేయాలని ఆయన సతీమణి హేమలత కోర్టును ఆశ్రయించారు. ఏకే మీనన్‌ నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ గురువారం ఈ పిటిషన్‌ను విచారించింది. నానావతి ఆస్పత్రి డాక్టర్ల బృందంతో వీడియో కాల్‌ ద్వారా వరవరరావుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైతే నేరుగా వెళ్లి పరీక్షించాలని ఆదేశించింది. వరవరరావు అనారోగ్యంతో మంచం పట్టారని, అలాంటి వ్యక్తి చట్టం నుంచి ఎలా పారిపోతారని ఆయన తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్‌ వాదనలు వినిపించారు. తదుపరి విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. 

Updated Date - 2020-11-13T09:05:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising