ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాల ప్రారంభోత్సవం రోజే ఓ విద్యార్థికి కరోనా

ABN, First Publish Date - 2020-11-03T10:46:45+05:30

పాఠశాలలు పునర్ ప్రారంభించిన మొదటిరోజే 18 ఏళ్ల ఓ విద్యార్థికి కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలిన ఘటన....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్వారంటైన్‌లోకి మరో 15 మంది విద్యార్థులు

రాణిఖేట్ (ఉత్తరాఖండ్): పాఠశాలలు పునర్ ప్రారంభించిన మొదటిరోజే 18 ఏళ్ల ఓ విద్యార్థికి కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రాణిఖేట్ పట్టణంలో వెలుగుచూసింది. ఓ విద్యార్థికి కరోనా ఉందని పరీక్షల్లో తేలడంతో అతనితో కలిసి ఉన్న మరో 15 మంది విద్యార్థులను క్వారంటైన్‌కు తరలించామని ఉత్తరాఖండ్ కొవిడ్ కంట్రోల్ రూం నోడల్ ఆఫీసర్ చెప్పారు. అనంతరం శానిటైజేషన్ చేసేందుకు పాఠశాలను మూడు రోజుల పాటు మూసివేశామని, కరోనా పాజిటివ్ అని వచ్చిన విద్యార్థితో కలిసి ఉన్న మరో 15 మంది విద్యార్థులకు కూడా కరోనా పరీక్షలు చేస్తామని నోడల్ ఆఫీసర్ జేసీ పాండే చెప్పారు.


 ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సోమవారం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునర్ ప్రారంభం కావడంతో ఓ విద్యార్థికి కరోనా ఉందని బయటపడింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రస్థుతం 3,914 కరోనా యాక్టివ్ కేసులుండగా, 57,609 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కరోనా వల్ల 1,027 మంది మరణించారని ఆ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ మంత్రిత్వశాఖ అధికారులు చెప్పారు. 

Updated Date - 2020-11-03T10:46:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising