ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనా మీద కోపం పెరిగిపోతోంది: ట‌్రంప్‌

ABN, First Publish Date - 2020-07-01T15:08:24+05:30

అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి అంత‌కంత‌కూ పెరుగుతూ ఉండటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చైనాపై కోపం క‌ట్ట‌లు తెంచుకుంటోంద‌ట‌.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్ట‌న్‌‌: అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి అంత‌కంత‌కూ పెరుగుతూ ఉండటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చైనాపై కోపం క‌ట్ట‌లు తెంచుకుంటోంద‌ట‌. ఈ అంటువ్యాధిని పూర్తిగా నియంత్రించే స్థితిలో తాములేమని అమెరికా ఆరోగ్యశాఖ‌ అధికారులు హెచ్చరించారు. ఈనేప‌ధ్యంలో ట్రంప్ ఒక ట్వీట్ చేస్తూ... అమెరికాకు ఈ మహమ్మారి వల్ల కలిగే భారీ నష్టంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న ఈ వ్యాధిని గ‌మ‌నిస్తున్నప్పుడు చైనాపై త‌న‌కు ఎక్క‌డ‌లేని ఆగ్ర‌హం క‌లుగుతున్న‌ద‌ని పేర్కొన్నారు. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్త‌రించడానికి బీజింగ్ కార‌ణ‌మ‌ని  ట్రంప్ ఆరోపించారు. కాగా ఇప్ప‌టికే అమెరికా, చైనాల మ‌ధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధానికి తోడు ఈ  కరోనా పోరాటం ఇరు దేశామ‌ధ్య వైరాన్ని మ‌రింత‌గా పెంచుతోంది. అమెరికాలో కరోనా కేసుల వ్యాప్తి గురించి అక్క‌డి అంటు వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌచి మాట్లాడుతూ క‌రోనాను నియంత్రించే స్థితిలో వైద్య‌శాఖ‌ లేద‌ని తేల్చిచెప్పారు. ఈ అంటువ్యాధిని నివారించ‌డంలో విఫ‌ల‌మైతే ప్రతిరోజూ ఒక మిలియన్ కేసులు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని ఆయన హెచ్చరించారు. 

Updated Date - 2020-07-01T15:08:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising