ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేం బెదరం.. చైనాకు అమెరికా నావికాదళం ఝలక్!

ABN, First Publish Date - 2020-07-06T17:09:31+05:30

అమెరికా యుద్ధ నౌకలను కూల్చే ఆయుధ సంపత్తి చైనా వద్ద ఉందంటూ చెబుతున్న ఓ నివేదికపై అమెరికా నౌకాదళం ఘాటుగా స్పందించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా యుద్ధ నౌకలను కూల్చే ఆయుధ సంపత్తి చైనా వద్ద ఉందంటూ చెబుతున్న ఓ నివేదికపై అమెరికా నౌకాదళం ఘాటుగా స్పందించింది. చైనాను చూసి బెదిరేది లేదని ట్విటర్ ద్వారా తేల్చి చెప్పింది.


ఇటీవల రెండు ఎయిర్ క్రాఫ్ట్ కారియర్‌లు యూఎస్ఎస్ నిమిట్జ్, రోనాల్డ్ రీగన్‌లను(ఫైటర్ విమానాలను తరలించగలిగిన యుద్ధ నౌకలు) అమెరికా దక్షిణ చైనా సముద్రం వైపుగా తరలించిన విషయం తెలిసిందే. చైనా నావికాదళం ఆ సముద్రంలో యుద్ధ విన్యాసాలు చేపడుతున్న సమయంలోనే అమెరికా తన ఎయిర్ క్రాఫ్ట్ కారియర్‌లను అక్కడ మోహరించింది. చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకే అమెరికా ఈ చర్య చేపట్టింది. 


ఈ నేపథ్యంలో చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్..ఓ సంచలన ట్వీట్ చేసింది. ఎయిర్ క్రాఫ్ట్ కారియర్‌లను కూల్చేయగల డీఎఫ్-21డీ, డీఎఫ్-26 క్షిపణులు చైనా వద్ద ఉన్నాయని, దక్షిణ చైనా సముద్రంపై చైనాకు పూర్తి పట్టు ఉందని అమెరికాను హెచ్చరించే ప్రయత్నం చేసింది. అయితే అమెరికా నావికాదళం దీనికి దీటుగా స్పందించింది.  ‘అవునా.. అయినా కూడా అక్కడ రెండు అమెరికా యుద్ద నౌకలు ఉన్నాయి. మేం బెదిరేది లేదు’ అంటూ ట్విటర్ ద్వారా పంచ్ ఇచ్చింది.

Updated Date - 2020-07-06T17:09:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising