ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యాసంస్థల పున: ప్రారంభంపై యూపీ సర్కారు నిర్ణయమిదే!

ABN, First Publish Date - 2020-09-21T11:55:46+05:30

ఉత్తరప్రదేశ్‌లో ఈరోజు నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోవడం లేదు. రాష్ట్రంలో విద్యాసంస్థలు తెరిచేందుకు అనువైన పరిస్థితులు లేవని ప్రభుత్వం తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఈరోజు నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోవడం లేదు. రాష్ట్రంలో విద్యాసంస్థలు తెరిచేందుకు అనువైన పరిస్థితులు లేవని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర విద్యాశాఖాధికారులు తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా స్కూళ్లు తెరిచే అవకాశాలు లేవు. అందుకే విద్యాసంస్థలను ఇంకా మూసివేసి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరు 21 నుంచి 9 వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ విద్యాసంస్థలను తెరిచేందుకు అనుమతినిచ్చింది. అయితే యూపీలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టనందున విద్యాసంస్థలు తెరిచేందుకు అనుమతినివ్వడం లేదు. 


ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోనున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ విద్యార్థుల కోసం ప్రత్యేక గైడ్‌లైన్స్ విడుదల చేసింది. దీని ప్రకారం విద్యాసంస్థలలో సిట్టింగ్ అరేంజ్‌మెంట్‌లో మార్పులు చేయనున్నారు. విద్యార్థులు ఒకరికొకరు ఆరడుగుల దూరంలో కూర్చోనున్నారు. అలాగే పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థులంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సివుంటుంది. అలాగే స్కూళ్లలో శానిటైజేషన్ ప్రక్రియ కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించింది. 


Updated Date - 2020-09-21T11:55:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising