ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాహనంపై కులం పేరు ఉంటే కఠిన చర్యలు

ABN, First Publish Date - 2020-12-27T16:18:15+05:30

ఉత్తరప్రదేశ్‌లోని వాహనాలపై ఇకపై జాతివాదం కనిపించకూడదు. ప్రధానమంత్రి కార్యాలయం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని వాహనాలపై ఇకపై జాతివాదం కనిపించకూడదు. ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) నుంచి వచ్చిన ఆదేశాలను యూపీ రాష్ట్ర రవాణాశాఖ జారీ చేసింది. యూపీలో వాహనాలపై కులాలు, జాతుల పేర్లు ఉంటున్నాయని, వీటి వలన ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉందని మహారాష్ట్రకు చెందిన ఉపాధ్యాయుడు పీఎంఓకు ఫిర్యాదు చేసిన మీదట ఈ విధమైన నిర్ణయం వెలువడింది. ఉత్తరప్రదేశ్‌లో కార్లు, బైక్‌లు, బస్సులు, ట్రక్కులు, చివరికి ఈ రిక్షాలపైన కూడా ‘బ్రాహ్మణ’, ‘క్షత్రియ’, ‘జాట్’, ‘యాదవ’, ‘కురేషి’ అని కనిపిస్తుంటాయి.


ముంబైలోని కల్యాణ్‌లో ఉంటున్న ఉపాధ్యాయుడు హర్షల్ ప్రభు ఈ విషయాన్ని ప్రధానమంత్రి మోదీ దృష్టికి తీసుకువెళ్లారు. మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఇదేవిధమైన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. వారు తమ కులాన్ని చెప్పుకుంటూ గొప్పగా భావిస్తున్నారని ఆరోపించారు. అయితే ఇటువంటి వ్యవహారం వలస ఇది సామాజిక సమస్యగా పరిణమించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను వెంటనే నియంత్రించాలని ఉపాధ్యాయుడు హర్షల్ ప్రభు ప్రధాని మోదీని కోరారు. ఈ ఫిర్యాదును ప్రధాని కార్యాలయం యూపీ సర్కారుకు పంపింది. వెంటనే స్పందించిన యూపీ అదనపు రవాణా కమిషనర్ ముఖేష్ చంద్ర ఇటువంటి వాహనాలపై చర్యలకు ఆదేశాలు జారీచేశారు. ఏ వాహనాలపై జాతివాదం కనిపించినా వాటిని వెంటనే సీజ్ చేయాలని ఆర్టీఓలను ఆదేశించారు. 

Updated Date - 2020-12-27T16:18:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising