ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా భయంతో ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వోద్యోగి

ABN, First Publish Date - 2020-04-02T23:23:08+05:30

కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాదిమంది ఈ మహమ్మారి సోకి ఆస్పత్రుల్లో చికిత్స

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాదిమంది ఈ మహమ్మారి సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ వైరస్ సోకుతుందనే భయంతో కొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటువంటి సంఘటనే చోటు చేసుకుంది. కరోనా సోకుతుందనే భయంతో రాష్ట్రంలోని షహరాన్‌పూర్‌లో కలకలం రేపింది.


ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ ప్రభుత్వ శాఖలో ఉద్యోగిగా పని చేస్తున్న వ్యక్తి ఇటీవల రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు విని డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. కొద్దిరోజులుగా అతను కుటుంబసభ్యులతోనూ అతను సరిగ్గా మాట్లాడటం లేదు. అయితే ఈ డిప్రెషన్ మరింత పెరిగిపోవడంతో.. అతను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా సోకుతుందనే భయంతోనే తాను ఆత్మహత్య చేసుకున్నానని.. ఆ వ్యక్తి సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. ఆ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-04-02T23:23:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising