కాంగ్రెస్ హత్రాస్ పర్యటన.. డీఎన్‌డీని దిగ్బంధించిన యూపీ పోలీసులు...
ABN, First Publish Date - 2020-10-03T20:02:18+05:30
హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ ప్రతినిధుల బృందం యూపీకి
నోయిడా: హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ ప్రతినిధుల బృందం యూపీకి బయల్దేరిన నేపథ్యంలో నోయిడాలోని ఢిల్లీ- ఉత్తర ప్రదేశ్ సరిహద్దు వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఢిల్లీ-నోయిడా డైరెక్ట్ (డీఎన్‌డీ) ఫ్లైవోవర్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ సీనియర్ అధికారులు సహా పెద్ద ఎత్తున పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పాటు యూపీలోని గౌతమ బుద్ధనగర్‌లో సీఆర్‌పీసీ సెక్షన్ 144 కూడా అమల్లోకి వచ్చింది. ‘‘సరిహద్దును మూసివేయలేదు. కానీ ఢిల్లీ-నోయిడా సరిహద్దు వద్ద తనిఖీలు పెంచారు’’ అని స్థానిక పోలీస్ అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా యూపీలోని హత్రాస్‌లో సమూహిక అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయిన దళిత యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఇవాళ మధ్యాహ్నం రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు హత్రాస్‌కు వెళ్లనున్నారు. బుధవారం తొలిసారి బాధిత కుటుంబాన్ని పరామర్శిచేందుకు రాహుల్, ప్రియాంక గాంధీలు ప్రయత్నించినప్పటికీ పోలీసులు వారిని గ్రేటర్ నోయిడా వద్ద అడ్డుకుని ఢిల్లీకి పంపించేశారు.
Updated Date - 2020-10-03T20:02:18+05:30 IST