ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతా మాదే తప్పా? కలెక్టర్ ది తప్పే లేదా?

ABN, First Publish Date - 2020-10-04T16:46:29+05:30

అంతేకాకుండా ఎస్పీ, డీఎస్పీతో పాటు బాధిత కుటుంబీకులపై కూడా ‘నార్కో’ పరీక్షలు నిర్వహించాలన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : హాథ్రస్ సంఘటనపై యోగి ప్రభుత్వం పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవడంతో పోలీసులు లోలోన రగిలిపోతున్నారు. ఎస్పీ, డీఎస్పీ ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ కావడంపై  పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా మండిపడింది.


‘‘ఎస్పీపై చర్యలకు ఆదేశించినపుడు, కలెక్టర్ పై కూడా ఎందుకు చర్యలు తీసుకోరు? నిర్లక్ష్యానికి కేవలం పోలీసు శాఖనే బలి కావాలా? పోలీసు శాఖ ఎలా బాధ్యత వహిస్తుంది? పరిపాలనా పరమైన ఆదేశాలు ఎవరిస్తారు? ఆ ఆదేశాలకూ, పోలీసు శాఖకు సంబంధమేమి? పరిపాలనా విభాగం ఆదేశాలిస్తే.. వాటిని పోలీసు శాఖ అమలు చేస్తుంది అంతే. కలెక్టర్ ఆదేశాల ప్రకారమే తాము నడుచుకున్నామని ఎస్పీ, డీఎస్పీలు సైతం ప్రకటించారు.’’ అని పోలీసు సంక్షేమ సంఘం పేర్కొంటోంది.


అంతేకాకుండా ఎస్పీ, డీఎస్పీతో పాటు బాధిత కుటుంబీకులపై కూడా ‘నార్కో’ పరీక్షలు నిర్వహించాలన్న ప్రతిపాదనపై పోలీసు సంఘం మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరోవైపు జిల్లా కలెక్టర్ వ్యవహార శైలిపై కూడా బాధిత కుటుంబీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ బెదిరింపులకు దిగుతున్నారని బాధిత కుటుంబం ఆరోపించింది. 

Updated Date - 2020-10-04T16:46:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising