ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యాంగంలోని శ్రీరాముని ఫొటో షేర్ చేసిన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్

ABN, First Publish Date - 2020-08-05T21:23:02+05:30

కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ భారత రాజ్యాంగంలోని శ్రీరాముని ఫొటోను షేర్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ భారత రాజ్యాంగంలోని శ్రీరాముని ఫొటోను షేర్ చేశారు. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భూమి పూజ చేసిన నేపథ్యంలో బుధవారం రవిశంకర్ ప్రసాద్ ఈ ఫొటోను ట్వీట్ చేశారు. 


అయోధ్య రామ జన్మ భూమి వివాదం కేసులో భగవాన్ శ్రీరాముని తరపున సుదీర్ఘ కాలం న్యాయవాదిగా రవిశంకర్ ప్రసాద్ పనిచేశారు. బుధవారం ఉదయం ఆయన ఇచ్చిన ఓ ట్వీట్‌లో భారత రాజ్యాంగం అసలు ప్రతిలోని శ్రీరాముడు, సీతా దేవి, లక్ష్మణుడు ఫొటోను షేర్ చేశారు. 


‘‘రావణాసురుడిని ఓడించిన తర్వాత అయోధ్యకు తిరిగి వస్తున్న శ్రీరాముడు, సీతా దేవి, లక్ష్మణుల సొగసైన చిత్రం భారత రాజ్యాంగం అసలు దస్తావేజులో ఉంది. ప్రాథమిక హక్కులకు సంబంధించిన అధ్యాయం ప్రారంభంలో ఈ చిత్రం ఉంది. మీ అందరితో దీనిని పంచుకోవాలని అనిపించింది’’ అని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. 


రవిశంకర్ ప్రసాద్‌కు ప్రభు శ్రీరాముని న్యాయవాదిగా పేరుంది. అలహాబాద్ హైకోర్టులో రామ జన్మ భూమి వివాదం కేసులో ఆయన భగవాన్ శ్రీరాముని తరపున వాదనలు వినిపించారు. 


సుప్రీంకోర్టులో ఈ కేసులో ప్రభు శ్రీరాముని తరపున ప్రముఖ న్యాయవాది కే పరాశరన్ వాదించారు. 

Updated Date - 2020-08-05T21:23:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising