ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధానిలో పెరుగుతున్న కోవిడ్ కేసులు... కరోనా కట్టడికి ప్రభుత్వ నూతన వ్యూహం!

ABN, First Publish Date - 2020-11-01T11:48:19+05:30

దేశరాజధాని ఢిల్లీతో పాటు పలుప్రాంతాలలో కరోనా కేసులు మరింతగా విజృంభిస్తున్న తరుణంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీతో పాటు పలుప్రాంతాలలో కరోనా కేసులు మరింతగా విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి అజయ్‌ భల్లా సోమవారం ఢిల్లీలో కరోనా వైరస్ స్థితిగతులపై చర్చించేందుకు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్యశాఖతో పాటు ఢిల్లీ ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. మీడియాకు హోం మంత్రిత్వశాఖ అధికారి తెలిపిన వివరాల ప్రకారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి వివిధ రాష్ట్రాల అధికారులతో సమావేశం కానున్నారు.


కరోనా వైరస్ కేసుల కట్టడిపై సమీక్షించనున్నారు. కాగా దేశరాజధానిలో శుక్రవారం 5,891 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 3.81 లక్షలు దాటింది. ఢిల్లీలో ఐదు వేలకు మించిన కరోనా కేసులు వరుసగా మూడవరోజు నమోదయ్యాయి. గురువారం ఢిల్లీలో కొత్తగా 5,739 కోరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఢిల్లీలో కరోనా కారణంగా 47 మంది మృతి చెందారు. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 6,470కి చేరింది. కాగా సోమవారం జరిగే సమావేశంలో కోరోనా కట్టడికి అనుసరించాల్సిన నూతన వ్యూహాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2020-11-01T11:48:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising