ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వలస కార్మికులతో క్రైం రేట్ పెరుగుతుందంటూ పోలీస్ రిపోర్ట్.. బిహార్ రాజకీయంలో దుమ్ముదుమారం

ABN, First Publish Date - 2020-06-05T05:30:00+05:30

వలస కార్మికులపై పోలీస్ ఉన్నతాధికారి సంచలన ఆరోపణలు చేస్తూ రిపోర్ట్ ఇవ్వడంతో బిహార్‌లో తీవ్ర అలజడి నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా : వలస కార్మికులపై పోలీస్ ఉన్నతాధికారి సంచలన ఆరోపణలు చేస్తూ రిపోర్ట్ ఇవ్వడంతో బిహార్‌లో తీవ్ర అలజడి నెలకొంది. ప్రభుత్వం కూడా ఒక్కసారిగా ఇరకాటంలో పడినట్టైంది. పోలీస్ ఉన్నతాధికారుల రిపోర్టుపై ప్రతిపక్ష నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. కోవిడ్, లాక్‌డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లోని వలస కార్మికులు తిరిగి స్వ రాష్ట్రానికి వస్తున్నారని దీంతో రాష్ట్రంలో క్రైం రేటు పెరిగే అవకాశముందని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు మే 29 న ఓ రిపోర్టును సిద్ధం చేసి విడుదల చేశారు.


‘‘గత రెండు నెలల్లో భారీ సంఖ్యలో వలస కార్మికులు వచ్చేశారు. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. దీంతో వారిలో తీవ్ర అసహనం, ఒత్తిడి ఉన్నాయి. వారికి ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం చాలా ప్రయత్నాలే చేస్తోంది. అయితే అందరికీ కల్పించడంలో కొంత ఇబ్బంది కావచ్చు. కుటుంబ పోషణ కోసం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉంది. వారందరూ కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు. ఉన్నతాధికారులు, జిల్లా ఎస్పీలు తగు జాగ్రత్తల్లో, అప్రమత్తతతో ఉండాలి’’ అన్నది ఆ రిపోర్టు సారాంశం.


అయితే పోలీసులు సిద్ధం చేసిన ఈ రిపోర్టుపై ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పేద కార్మికులను నితీశ్ ప్రభుత్వం తీవ్రంగా అవమానిస్తోందని మండిపడ్డారు. 

Updated Date - 2020-06-05T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising