ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆసుపత్రికి తరలింపు

ABN, First Publish Date - 2020-04-06T11:50:05+05:30

కరోనా వైరస్ సోకి హోం క్వారంటైన్‌లో ఉన్న బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ను ఆసుపత్రికి తరలించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్ (యునైటెడ్ కింగ్‌డమ్): కరోనా వైరస్ సోకి హోం క్వారంటైన్‌లో ఉన్న బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ను ఆసుపత్రికి తరలించారు. యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌ (55) గత పది రోజులుగా  కరోనా లక్షణాలతో హోం క్వారంటైన్‌లో ఉన్నారు. పరీక్షల్లో బోరిస్ జాన్సన్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఇంగ్లండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ క్రిస్ విట్టీ తెలిపారు. బోరిస్ జాన్సన్ కు కరోనా తగ్గుముఖం పట్టక పోవడంతో ముందుజాగ్రత్త చర్యగా అతన్ని ఆసుపత్రికి తరలించామని డౌనింగ్ స్ట్రీట్ అధికారులు చెప్పారు. గత పదిరోజులుగా ప్రధాని బోరిస్ ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండి కరోనా వ్యాప్తిపై సమీక్షిస్తూ వీడియో మెసేజ్ లు విడుదల చేశారు. అనారోగ్యంగా ఉన్న జాన్సన్ కు వైద్యులు ఫోన్ ద్వార సలహా అందించారు. వైద్యులు ప్రధానిని వ్యక్తిగతంగా పరీక్షించేందుకు వీలుగా అతన్ని ఆసుపత్రికి తరలించారు. బ్రిటన్ దేశంలో 48 వేల మందికి కరోనా వైరస్ సోకగా, 4,934 మంది మరణించారు. 

Updated Date - 2020-04-06T11:50:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising