ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనాకు త్వరలో మరో ఝలక్!

ABN, First Publish Date - 2020-07-05T20:35:52+05:30

చైనా కంపెనీలతో దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందని బ్రిటన్ ప్రభుత్వం కూడా భావిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో 5జీ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్న చైనా కంపెనీ హువావేకు చెక్ పెట్టాలనే నిర్ణయానికి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: చైనా కంపెనీలతో దేశ భద్రతకు ముప్పు పోంచి ఉందని బ్రిటన్ ప్రభుత్వం కూడా భావిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో 5జీ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్న చైనా కంపెనీ హువావేకు చెక్ పెట్టాలనే నిర్ణయానికి వచ్చింది. ఇప్పటివరకూ అమర్చిన హువావే కంపెనీ పరికరాలను తొలగించడంతో పాటూ మరో ఆరు నెలల్లో బ్రిటన్‌లో పూర్తిగా ఆ కంపెనీ సేవలను నిలిపివేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో చైనా టెక్నాలజీ వల్ల దేశానికి ముప్పు పొంచి ఉందని అని బ్రిటన్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఇటీవల ఓ అంచనాకు వచ్చింది. హువావేపై అమెరికా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ ఆంక్షల ద్వారా అమెరికా సంస్థల టెక్నాలజీ చైనా కంపెనీలకు దొరకకుండా అమెరికా గట్టి చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో హువావే..ఎవరీకీ తెలియని ఓ కొత్త టెక్నాలజీని బ్రిటన్‌లో వినియోగిస్తే అది దేశ భద్రతకు పెద్ద ముప్పని సైబర్ సెక్యూరిటీ సెంటర్ భావిస్తోంది. ఈ వివరాలతో కూడిన ఓ సవివరమైన నివేదికను త్వరలో బ్రిటన్ ప్రధానికి సమర్పించనుంది.

Updated Date - 2020-07-05T20:35:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising