ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూకేలో 40 వేలు దాటిన కరోనా మరణాలు

ABN, First Publish Date - 2020-06-06T14:00:55+05:30

బ్రిటన్‌లో కరోనా మహమ్మారి మరణ మృదంగం కొనసాగుతోంది. నిన్న ఒకేరోజు మరో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: బ్రిటన్‌లో కరోనా మరణ మృదంగం కొనసాగుతోంది. ఈ మహమ్మారి కారణంగా నిన్న ఒకేరోజు మరో 357 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇక్కడ మొత్తం కొవిడ్-19 మృతుల సంఖ్య 40,261కి చేరుకున్నట్టు బ్రిటిష్ ఆరోగ్య, సామాజిక సంరక్షణ శాఖ వెల్లడించింది. రోజువారీ కేసులు మరో 1650 పెరగడంతో.. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,83,311కి చేరింది.


కాగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారి సంఖ్య మాత్రం ప్రస్తుతం 571కి తగ్గినట్టు ఆరోగ్య మంత్రి మాట్ హాన్కాక్ వెల్లడించారు. ఏప్రిల్ 12 నాటికి వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న వారి సంఖ్య 3 వేలుగా ఉంది. తాజాగా ఈ సంఖ్య తగ్గడం కచ్చితంగా తమకు ‘‘ప్రోత్సాహకరమైన’’ సంకేతాలేనని ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. జూన్ 15 నుంచి ఆస్పత్రుల్లో సందర్శనకు వచ్చేవారు, ఔట్-పేషెంట్లు మాస్కులు ధరించడం తప్పనిసరి చేసినట్టు ఆయన తెలిపారు. 

Updated Date - 2020-06-06T14:00:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising