ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరణాల్లో ఇటలీని దాటేసిన బ్రిటన్!

ABN, First Publish Date - 2020-05-05T21:45:52+05:30

కోవిడ్-19 కారణంగా బ్రిటన్‌లో ఇప్పటి వరకు 32 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు అధికారిక గణాంకాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: కోవిడ్-19 కారణంగా బ్రిటన్‌లో ఇప్పటి వరకు 32 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో కరోనా అనుమానిత మరణాలను కూడా చేర్చడంతో మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఏప్రిల్ 24 నాటికి ఇంగ్లండ్ అండ్ వేల్స్‌లో 29,648 మంది ప్రాణాలు కోల్పోయినట్టు జాతీయ గణాంకాల కార్యాలయం తెలిపింది. వీరందరూ కోవిడ్-19 కారణంగా మరణించినట్టు వారి డెత్ సర్టిఫికెట్లలో పేర్కొంది. ఇందులో స్కాట్లాండ్, ఉత్తర ఐర్లండ్‌లో సంభవించిన మరణాలు కూడా ఉన్నాయి. తాజాగా, వీటిలో అనుమానిత కోవిడ్ మరణాలను కూడా చేర్చడంతో మృతుల సంఖ్య 32 వేలు దాటేసింది. దేశంలో ఇప్పటి వరకు 32,313 మంది కోవిడ్ కారణంగా మరణించినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. యూరప్‌‌లో ఇప్పటి వరకు ఇటలీలోనే అత్యధిక మరణాలు సంభవించగా, ఇప్పుడు ఆ దేశాన్ని బ్రిటన్ దాటేసింది. అయితే, ఇటలీ మరణాల్లో కరోనా అనుమానిత మరణాలను చేర్చలేదు. 

Updated Date - 2020-05-05T21:45:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising