ఎలా ముందుకెళ్లాలి?: చర్చించిన యూజీసీ
ABN, First Publish Date - 2020-04-28T06:51:53+05:30
కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన కొత్త అడ్మిషన్లు, ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి ఎదురవనున్న ఇతర సమస్యల్ని చర్చించేందుకు గాను యూజీసీ సోమవారం అత్యవసర సమావేశాన్ని...
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన కొత్త అడ్మిషన్లు, ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి ఎదురవనున్న ఇతర సమస్యల్ని చర్చించేందుకు గాను యూజీసీ సోమవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. లాక్‌డౌన్ కారణంగా నష్టపోయిన కాలాన్ని భర్తీ చేయడంతో పాటు, ఆన్‌లైన్‌లో విద్యాబోధన విషయమై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన రెండు ప్యానెల్స్ ప్రతిపాదించిన సిఫార్సులపై కమిషన్ చర్చించింది.
Updated Date - 2020-04-28T06:51:53+05:30 IST