ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్ ఎత్తివేతపై ఏమాత్రం సుముఖంగా లేని ఉద్ధవ్!

ABN, First Publish Date - 2020-05-30T19:52:02+05:30

ముఖ్యంగా హాట్‌స్పాట్లుగా ఉన్న ముంబై, పూణె లాంటి ప్రాంతాల్లో నిబంధనలను మరింత కఠినతరం చేయాలని,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేయడానికి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదు. అనేక ఆంతంరగిక, అధికారిక సమావేశాల్లో కూడా ఆయన ఇదే విధమైన సిగ్నల్స్ ఇస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా హాట్‌స్పాట్లుగా ఉన్న ముంబై, పూణె లాంటి ప్రాంతాల్లో నిబంధనలను మరింత కఠినతరం చేయాలని, లాక్‌డౌన్‌ను కొనసాగించాలని ఆయన దృఢ నిశ్చయంతో ఉన్నారు. మరో 15 రోజుల పాటు అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన పదే పదే కోరుతున్నారు.


ఈ నెలాఖరుకు లాక్‌డౌన్‌పై కేంద్రం ఓ విస్పష్ట ప్రకటన చేయగానే లాక్‌డౌన్ నిబంధనలను కాస్త సడలించాలనే నిర్ణయంలో ఆయన ఉన్నట్లు సమాచారం. కోవిడ్ కేసులు కొంతలో కొంత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయని, అయితే మరణాల రేటు మాత్రం బాగా తగ్గిందని ఆయన స్పష్టం చేశారు. అయినా సరే... అత్యంత జాగరూకతతో ఉండాలని ఆయన అధికారులకు సూచించారు.


ప్రస్తుతం రాష్ట్రం ఓ టర్నింగ్ పాయింట్‌లో ఉందని, ముంబై, పూణే లాంటి నగరాల్లో మహమ్మారి మరింత విజృంభించే ప్రమాదముందని ఆయన  హెచ్చరించారు. చైనా, కేరళలో ఇప్పటికే రెండో దశ వ్యాప్తి ప్రారంభమైందని, ఒకవేళ నిబంధనలను సడలిస్తే, రెండో దశ వ్యాప్తి ఎలా ఉంటుందో చెప్పడం కష్టమన్నారు. గత రెండు నెలలుగా మహమ్మారిని అరికట్టడంలో యంత్రాంగం బాగా కృషి చేస్తోందని, కరోనా కేసుల సంఖ్య విషయంలోనూ అత్యంత పారదర్శకతతో ఉన్నామని ఉద్ధవ్ తెలిపారు. 

Updated Date - 2020-05-30T19:52:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising