ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఓ గొప్ప నేత వారసత్వాన్ని అనుభవిస్తున్న అసమర్థ పుత్రుడు ఉద్ధవ్’

ABN, First Publish Date - 2020-08-02T22:11:26+05:30

శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై అఖిల భారతీయ సంత్ సమితి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై అఖిల భారతీయ సంత్ సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయోధ్యలోని రామాలయం నిర్మాణానికి భూమి పూజను వర్చువల్ పద్ధతిలో నిర్వహించాలని ఉద్ధవ్ పిలుపునివ్వడంపై మండిపడింది. 


అఖిల భారతీయ సంత్ సమితి ప్రధాన కార్యదర్శి జితేంద్రానంద సరస్వతి మాట్లాడుతూ, గొప్ప నేత బాల్ థాకరే వారసత్వాన్ని ఓ అసమర్థుడైన కొడుకు అనుభవిస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఉద్ధవ్ ఓ కాన్వెంట్ స్కూల్లో చదివారని, ఆయనకు వర్చువల్‌కు, వాస్తవానికి తేడా తెలియదని దుయ్యబట్టారు. 


తన తండ్రి వారసత్వంపై బతుకుతున్న అసమర్థుడైన కొడుకు రాజకీయ భాషను ఆధ్యాత్మికత విషయంలో ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. ఇటాలియన్ బెటాలియన్ ఒడిలో కూర్చున్న వ్యక్తి నుంచి ఇంత కన్నా ఎక్కువ ఏం ఆశించగలమని అన్నారు. 


భూమి పూజను భూమిని తాకకుండా ఏవిధంగా నిర్వహించగలమని ప్రశ్నించారు. 

Updated Date - 2020-08-02T22:11:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising