ఉదయకుమార్‌పై కేసు నమోదు
ABN, First Publish Date - 2020-04-05T12:53:18+05:30
ఉదయకుమార్‌పై కేసు నమోదు
చెన్నై: ప్రభుత్వ నిబంధనలు ఉల్లఘించిన పచ్చై తమిళగం పార్టీ అధ్యక్షుడు శుభా ఉదయకుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కడలూర్ జిల్లా నాగర్‌కోయిల్ సమీపంలోని తంగవినై ప్రాంతానికి చెందిన శుభా ఉదయకుమార్ పచ్చై తమిళగం పార్టీ అధ్యక్షడిగాను, గాంధేయ వాధిగా వ్యహరిస్తున్నారు. ‘కరోనా’ వైరస్ కారణంగా ప్రభుత్వం 144 సెక్షన్ విధించడంతో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేలాది మంది కార్మికులు ఆకలితో అలమ టిస్తున్నారని, వారిని ఆదుకొనేలా ఆహారం, భద్రత కల్పించాలంటూ శనివారం ఉదయం తన ఇంటి ప్రాంగణంలో ఉదయకుమార్ దీక్ష చేపట్టాడు. ఆయనకు మద్ద తుగా ఆ ప్రాంతానికి చెందిన పలువురు యువకులు కూడా దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి నిరాహారదీక్ష చేపట్టిన ఉదయకుమార్‌పై చర్యలు తీసుకోవాలంటూ సహాయ కమిషనర్ సుందరమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
Updated Date - 2020-04-05T12:53:18+05:30 IST