ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా లాక్‌డౌన్: మానవత్వం చాటుకున్న కాజల్, దిశ సిస్టర్స్

ABN, First Publish Date - 2020-03-27T21:39:42+05:30

ప్రాణాంతక వైరస్ కోవిడ్‌-19 వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో వీధుల్లోని మూగజీవాలు తిండి దొరక్క ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రాణాంతక వైరస్ కోవిడ్‌-19 వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో వీధుల్లోని మూగజీవాలు తిండి దొరక్క అల్లాడుతున్నాయి. ఇన్నాళ్లూ ఎవరో ఒకరు పెడితేనో, లేక వదిలేసిన ఆహార పదార్ధాలతోనో కడుపు నింపుకున్న వీధి కుక్కలు ఇప్పుడు మెతుకు విదిల్చేవారు కూడా లేక దీనంగా ఎదురుచూస్తున్నాయి. వీటి పరిస్థితి చూసి నాగ్‌పూర్‌లో అక్కాచెల్లెళ్లు కాజల్, దిశ చలించిపోయారు. స్వయంగా ఆహార పదార్థాలు తీసుకెళ్లి వాటికి పెడుతూ మానవత్వం చాటుకుంటున్నారు. దీనిపై స్థానిక మీడియా పలకరించడంతో... ‘‘షాపులన్నీ మూసేయడం, అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో వీధి కుక్కలకు ఆహారం దొరకడం లేదు. ఈ విపత్కర సమయంలో వాటిని పోషించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది..’’ అని పేర్కొన్నారు. కాగా ఈ ఇద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పలువురు నెటిజన్లు తమ వంతు సాయంగా మూగ జీవాలకు ఆహారం పెట్టేందుకు ముందుకొస్తున్నారు. ఈ అక్కాచెల్లెళ్లు ఎంతో మందికి స్ఫూర్తి నింపుతున్నారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Updated Date - 2020-03-27T21:39:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising