ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీ తాగి కుప్పకూలిన ఇద్దరు సాధువులు... చావు బతుకుల్లో మరో సాధువు..

ABN, First Publish Date - 2020-11-22T04:24:29+05:30

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం మధురలో ఇద్దరు సాధువులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మరో సాధువులు చావు బతుకుల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మధుర: ఉత్తర ప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం మధురలో ఇద్దరు సాధువులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మరో సాధువులు చావు బతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్నారు. వారు బస చేస్తున్న ప్రదేశంలో తేనీరు సేవించిన ఈ ముగ్గురూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. 60 ఏళ్ల గులాబ్ సింగ్ ఘటనా ప్రదేశం‌లోనే ప్రాణాలు కోల్పోగా... సాధు శ్యాం సుందర్ (61) ఆస్పత్రికి తీసుకెళ్లుండగా మార్గమధ్యంలోనే చనిపోయారని ఎస్ఎస్పీ డాక్టర్ గౌరవ్ గ్రోవర్ పేర్కొన్నారు. రామ్ బాబు అనే మరో సాధువుకు ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో చికిత్స జరుగుతోందని ఆయన తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టానికి అప్పగించామనీ... ఫోరెన్సిక్ బృందం ఆధారాలను సేకరిస్తోందని పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఒకరైన గులాబ్ సింగ్ కోసి కలాన్ పోలీస్ స్టేషన్ పరిథిలోని దౌలాతా గ్రామస్తుడు కాగా... శ్యాం సుందర్, రామ్ బాబులిద్దరూ గోవర్థన్ పోలీస్ స్టేషన్ పరిథిలోని పైన్‌తా గ్రామానికి చెందిన వారని అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-11-22T04:24:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising