ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన 2 ఆసుపత్రులకు జరిమానా

ABN, First Publish Date - 2020-09-29T16:31:23+05:30

నవీ ముంబై నగరంలో కొవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించిన రెండు ప్రైవేటు ఆసుపత్రులకు జరిమానా విధిస్తూ నవీముంబై మున్సిపల్ కార్పొరేషన్ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై (మహారాష్ట్ర): నవీ ముంబై నగరంలో కొవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించిన రెండు ప్రైవేటు ఆసుపత్రులకు జరిమానా విధిస్తూ నవీముంబై మున్సిపల్ కార్పొరేషన్ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. నవీ ముంబై నగరంలోని రెండు ప్రైవేటు ఆసుపత్రులు ఎలాంటి అనుమతి లేకుండా కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నాయని తమ దర్యాప్తులో తేలడంతో  ఆయా ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశామని నవీ ముంబై మున్సిపల్ అధికారులు చెప్పారు. దీనిపై ఆయా ఆసుపత్రులు సమాధానం చెప్పకపోవడంతో రెండు ఆసుపత్రుల యాజమాన్యాలకు లక్షరూపాయల చొప్పున జరిమానా విధించామని నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిజిత్ భంగార్ చెప్పారు. 


భవిష్యత్తులో కరోనా రోగులకు ఆసుపత్రిలో చికిత్స చేయవద్దని తాము రెండు ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేశామని కమిషనర్ చెప్పారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించి కరోనా రోగులను అనుమతి లేకుండా చేర్చుకొని చికిత్స చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదులపై తాము కఠినచర్యలు తీసుకున్నామని మున్సిపల్ కమిషనరు వివరించారు.

Updated Date - 2020-09-29T16:31:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising