ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు ఆర్మీ అధికారులకు కరోనా పాజిటివ్!

ABN, First Publish Date - 2020-03-30T03:53:16+05:30

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. భారత్‌లో కూడా ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే దేశంలో 1024 మంది కరోనా పాజిటివ్‌గా తేలారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. భారత్‌లో కూడా ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే దేశంలో 1024 మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. ఈ క్రమంలో ఇద్దరు ఆర్మీ అధికారులకు ఆదివారం చేసిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ ఫలితాలు వచ్చినట్లు భారత ఆర్మీ వెల్లడించింది. కోల్‌కతాలోని ఆర్మీ కమాండ్ ఆస్పత్రిలోని ఓ వైద్యుడికి కరోనా సోకిందని తెలుస్తోంది. ఇటీవలే ఢిల్లీ నుంచి కోల్‌కతా వచ్చిన ఆయనకు చేసిన కరోనా నిర్ధారణ పరీక్షలు పాజిటివ్ ఫలితాలిచ్చాయట. దీంతో సదరు అధికారికి క్వారంటైన్ చేసిన ఆర్మీ.. ఆయన సహోద్యోగుల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. అలాగే డెహ్రాడూన్‌లో జేసీవోగా విధులు నిర్వర్తిస్తున్న మరో జవాను కూడా కరోనా పాజిటివ్‌గా తేలాడు.


కాగా, శ్రీనగర్‌లోని ఓ జవానుకు కూడా కరోనా సోకిందని కొన్ని వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలను ఇండియ్ ఆర్మీ ఖండించింది. ఆదివారం నాడు ఇద్దరు ఆర్మీ అధికారులే కరోనా పాజిటివ్‌గా తేలారని స్పష్టంచేసింది.

Updated Date - 2020-03-30T03:53:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising