ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షాకింగ్ : 4 రోజుల్లో 23 మంది విమాన ప్రయాణికులకు కరోనా

ABN, First Publish Date - 2020-05-29T11:49:12+05:30

కేవలం నాలుగురోజుల్లో దేశీయ విమానాల్లో ప్రయాణించిన 23 మంది ప్రయాణికులకు కరోనా వైరస్ సోకడం సంచలనం రేపింది.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కేవలం నాలుగురోజుల్లో దేశీయ విమానాల్లో ప్రయాణించిన 23 మంది ప్రయాణికులకు కరోనా వైరస్ సోకడం సంచలనం రేపింది. లాక్‌డౌన్ వల్ల రెండునెలల అనంతరం దేశీయ విమాన సర్వీసులకు పౌరవిమానయాన శాఖ పచ్చజెండా ఊపింది. ఈ నెల 25 నుంచి 28వతేదీ వరకు కేవలం నాలుగురోజుల్లోనే పలు విమానాల్లో ప్రయాణించిన 23 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో కలవరం మొదలైంది. కరోనా వచ్చిన విమాన ప్రయాణికులను ఆసుపత్రుల్లోని క్వారంటైన్ కు తరలించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు ప్రయాణించిన విమానాల్లో ప్రయాణించిన ప్రయాణికులు, విమాన సిబ్బందిని గుర్తించి వారికి కరోనా పరీక్షలు చేయించారు. వారందరినీ ముందుజాగ్రత్తగా హోం క్వారంటైన్ చేశారు. విమానాల్లో కరోనా బాధితులు వెలుగుచూడటంతో పౌరవిమానయాన శాఖ అధికారులు మరిన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భౌతిక దూరం పాటించడం, ఫేస్ మాస్క్ లు, ఫేస్ షీల్డులు ధరించడం, విమానాలను శానిటైజ్ చేసే పనులు చేపట్టారు.


చెన్నై -కోయంబత్తూర్ ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడికి కరోనా ఉందని తేలింది. ఢిల్లీ-లూథియానా ఎయిర్ ఇండియా విమానంలో మరో ప్రయాణికుడికి కరోనా ఉందని పరీక్షల్లో వెల్లడైంది. అహ్మదాబాద్-గువహటి స్పైస్ జెట్ విమానంలో ప్రయాణించిన ఇద్దరికి కరోనా సోకింది. ఢిల్లీ -జమ్మూ ఇండిగో విమానంలో ప్రయాణించిన నలుగురికి కరోనా ఉందని వెల్లడైంది. ఢిల్లీ-మధురై ఇండిగో విమానంలో ప్రయాణించిన వారికి కరోనా పాజిటివ్ వచ్చింది. చెన్నై -సేలం ట్రూజెట్ విమానంలో ప్రయాణించిన ఆరుగురికి కరోనా ఉంది. మొత్తంమీద 4రోజుల్లో 23 మంది ప్రయాణికులకు కరోనా ఉందని తేలడంతో ఆయా విమానాల్లో ప్రయాణించిన  ప్రయాణికులందరినీ గుర్తించి క్వారంటైన్ చేశారు. 

Updated Date - 2020-05-29T11:49:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising