రైతుల ఆందోళనలో ‘టుక్‌డే టుక్‌డే గ్యాంగ్’: కేంద్ర మంత్రి
ABN, First Publish Date - 2020-12-12T00:25:52+05:30
అయితే టుక్‌డే టుక్‌డే గ్యాంగ్ గురించి సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కొద్ది రోజుల క్రితమే స్పష్టతనిచ్చింది. అయితే తాజాగా
న్యూఢిల్లీ: వివాదస్పద వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తున్న ఆందోళనను ‘టుక్‌డే టుక్‌డే గ్యాంగ్’ నిర్వహిస్తోందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. దానికి సంబంధించిన సాక్ష్యాధారలు తమ వద్ద ఉన్నాయని, వారే ఈ ఆందోళన నిర్వహిస్తున్నారని ఆయన పునరుద్ఘాటించారు. ప్రభుత్వం, రైతులు పలుమార్లు జరిపిన చర్చలు విఫలం కావడానికి ప్రధాన కారణం కూడా వారేనని అన్నారు. షార్జిల్ ఇమామ్, ఉమర్ ఖలీద్, గౌతమ్ నవ్లఖా లాంటి వ్యక్తులకు ఆందోళనలో ఉన్న వ్యక్తులు మద్దతు ఇవ్వడాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.
అయితే టుక్‌డే టుక్‌డే గ్యాంగ్ గురించి సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కొద్ది రోజుల క్రితమే స్పష్టతనిచ్చింది. అయితే తాజాగా న్యాయ శాఖ మంత్రి మరోసారి ఇదే ప్రస్తావన లేవనెత్తడం ఆసక్తికరంగా మారింది. రైతులు చేస్తున్న ఆందోళనపై రవిశంకర్ ప్రసాద్ కంటే ముందు పలువురు కేంద్ర మంత్రులు వివాదస్ప వ్యాఖ్యలు చేశారు. ‘‘చర్చలు జరిగే సమయంలో షార్జిల్ ఇమామ్‌ను విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతు సమస్యల గురించి వేరే విషయాలపై చర్చించడం ఏంటి? దేశాన్ని విచ్చిన్నం చేయాలనుకుంటున్న వారి చేతుల్లోకి రైతుల ఆందోళన వెళ్తోంది’’ అని ప్రకాష్ జావడేకర్ అన్నారు.
ఇక కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చేసిన వ్యాఖ్యలు రవిశంకర్ చేసిన వ్యాఖ్యలకు చాలా దగ్గరి పోలిక ఉంది. ‘‘కనీస మద్దతు ధర, మండిలకు సంబంధించిన విషయాలు రైతులు ప్రస్తావించాలి. కానీ దానికి బదులు వేరే విషయాలు చర్చలోకి తీసుకువస్తున్నారు. రైతులకు ఇది చాలా ప్రమాదం. రైతు సమస్యల నుంచి పూర్తిగా పక్కదారి పట్టించే విషయాలు ఇవి’’ అని నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు.ఇక మరో కేంద్ర మంత్రి రావుసాహేబ్ ధాన్వే అయితే రైతుల ఆందోళనకు చైనా, పాకిస్తాన్‌లతో సంబంధం ఉందని మరింత ఘాటుగా వ్యాఖ్యానించారు.
Updated Date - 2020-12-12T00:25:52+05:30 IST