ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోయేదేముంది.. ఓసారి ట్రై చేయండి.. ప్రజలకు ట్రంప్ కీలక సూచన!

ABN, First Publish Date - 2020-04-05T21:05:51+05:30

కరోనా పనిపట్టే ఔషధంగా అందరూ భావిస్తున్న హౌడ్రోక్సీక్లోరోక్విన్ వినియోగించాలంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రజలకు సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: కరోనా పనిపట్టే ఔషధంగా అందరూ భావిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ వినియోగించాలంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రజలకు సూచించారు. ఇప్పటికే ఆయన భారత్ ప్రధాని మోదీకి ఫోన్ చేసిన సదరు మందును ఎగుమతి చేసేందుకు అనుమతించాలని కోరిన విషయం తెలిసిందే. అంతకమునుపే.. అమెరికా ప్రజలనుద్దేశించి ఆయన హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడాలని కోరారు. ‘ప్రజలు దీన్ని వాడి చూస్తారని ఆశిస్తున్నారు.  ఈ మందు ఎప్పటి నుంచో మార్కెట్లో ఉంది. ఓ సారి వినియోగిస్తే పోయేదేముంది? నేనూ ఈ మందును ట్రై చేస్తా. అయితే ముందుగా డాక్టర్లు సలహా తీసుకుంటా. ప్రజలు కూడా ఈ విషయమై డాక్టర్ల సూచన ఏమిటో తెలుసుకోవాలి. వారి సలహాల ప్రకారమే చేయాలి’ అని శనివారం పత్రికా సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యానించారు.


అయితే అమెరికా మీడియా మాత్రం ట్రంప్ సూచనల పట్ల పెదవి విరుస్తోంది. హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడాలంటూ ట్రంప్ ప్రజలను ఒత్తిడి చేస్తున్నారని అక్కడి మీడియా వ్యాఖ్యానించింది. మందు ప్రభావశీలతపై ఎటువంటి శాస్త్రీయపరమైన ఆధారాలు లేకపోవడాన్ని అక్కడి మీడియా గుర్తుచేస్తోంది. యూరోపియన్ కమిషన్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించిందన్న విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. ముందు వినియోగించడం వల్ల ఉత్పన్నమ్మయ్యే హృద్రోగ సంబంధ సమస్యలను కూడా ఈ సందర్భంగా అక్కడి మీడియా హైలైట్ చేస్తోంది. మరోవైపు.. భారత్‌లో కరోనా రోగులకు సేవ చేసే వైద్య సిబ్బంది.. హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడచ్చంటూ ఇటీవల ఐసీఎమ్ఆర్ మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-04-05T21:05:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising