ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అతడిని చంపిద్దామనుకున్నా.. కానీ.. ట్రంప్ సంచలన వ్యాఖ్య

ABN, First Publish Date - 2020-09-16T16:14:41+05:30

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సిరియా అధ్యక్షుడు బసర్ అల్ అసద్‌ను చంపించాలనుకున్నట్టు తెలిపారు. అటువంటి ఆలోచనే తనకు రాలేదని గతంలో ప్రకటించిన ట్రంప్.. తాజాగా ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ఆలోచన చేసినట్టు అంగీకరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ను చంపించాలనుకున్నట్టు తెలిపారు. అటువంటి యోచనే తనకు రాలేదని గతంలో ప్రకటించిన ట్రంప్.. తాజాగా ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ఆలోచన చేసినట్టు అంగీకరించారు.


‘అసద్‌ను చంపిద్దామనుకున్నాను. ఈ విషయామై ఓ నిర్ణయానికి కూడా వచ్చాను..కానీ మాటిస్ దీనికి అంగీకరించలేదు’ అని ట్రంప్ తెలిపారు. మాటిస్ కారణంగానే తాను వెనక్కు తగ్గానని తెలిపారు. జేమ్స్ మాటిస్ అప్పట్లో ట్రంప్ ప్రభుత్వంలో డిఫెన్స్ సెక్రెటరీగా సేవలందించారు. 


‘నా దృష్టిలో మాటిస్ ఓ దారుణమైన సైనిక జనరల్. ఆయన నాయకత్వం కూడా తీసికట్టుగానే ఉంటుంది’ అని ట్రంప్ ఇంటర్వ్యూ సందర్భంగా వ్యాఖ్యానించారు.  అయితే అసద్‌ను చంపిచాలనుకున్న నిర్ణయాన్ని అమలు చేయకపోవడంపై తానేమీ చింతించ్చట్లేదని ట్రంప్ స్పష్టం చేశారు. 


అమెరికా జర్నలిస్టు బాబ్ వుడ్‌వర్డ్ 2018లో రాసిన పుస్తకంలో అసద్‌ను మట్టుపెట్టాలన్న ట్రంప్ ప్రణాళిక గురించి తొలిసారిగా ప్రస్తావించారు. 2017లో జరిగిన రసాయనిక దాడికి అసద్ ప్రభుత్వమే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తాక ఆయన్ను మట్టుపెట్టేందుకు ఓ ప్రణాళిక వేయాలంటూ ట్రంప్ అప్పటి డిఫెన్స్ సెక్రెటరీ మాటిస్‌ను కోరారని వుడ్‌వర్డ్ తన పుస్తకంలో రాసుకున్నారు.


కానీ మాటిస్ ట్రంప్ డిమాండ్లను వ్యతిరేకించడంతో ఈ ప్లాన్‌కు ఆదిలోనే ఫుల్ స్టాప్ పడిందని వుడ్ వర్డ్స్ రాసుకొచ్చారు. ఈ విషయాన్ని ఇప్పటివరకూ ఖండిస్తూ వచ్చిన ట్రంప్..మంగళవారం నాడు తొలిసారిగా అది వాస్తవేమనని అంగీకరించారు.  

Updated Date - 2020-09-16T16:14:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising