ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రిన్స్ హ్యారీకి షాక్ ఇచ్చిన ట్రంప్!

ABN, First Publish Date - 2020-03-30T17:51:19+05:30

ప్రిన్స్‌ హ్యారీ, మేఘ‌న్ మార్కెల్‌ దంప‌తులు భవితవ్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ దంపతులు అమెరికాలో నివసించాలని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ప్రిన్స్‌ హ్యారీ, మేఘ‌న్ మార్కెల్‌ దంప‌తులు భవితవ్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ దంపతులు అమెరికాలో నివసించాలని భావిస్తే వారి భద్రతా ఖర్చులను తమ ప్రభుత్వం చెల్లించబోదని స్పష్టం చేశారు. ప్రిన్స్ దంపతులు కాలిఫోర్నియా వచ్చినట్టు వస్తున్న వార్తలపై ఆయన ట్విటర్లో స్పందిస్తూ.. ‘‘బ్రిటన్ అన్నా, రాణి అన్నా నాకు చాలా ఇష్టం. వారితో నాకు గొప్ప స్నేహం ఉంది. రాజ కుటుంబాన్ని వీడిన హ్యారీ, మేఘన్ కెనడాలో శాశ్వతంగా నివసిస్తారని విన్నాం. ఇప్పుడు వారు కెనడాను వీడి అమెరికా వచ్చారు. అయితే వారి భద్రత ఖర్చులను అమెరికా చెల్లించదు. వాళ్లే చెల్లించాలి!..’’ అని పేర్కొన్నారు. 


క్వీన్ ఎలిజబెత్-2 మనవడైన హ్యారీ... అమెరికా నటి మేఘన్ మార్కెల్‌ను పెళ్లాడారు. రాజగృహం విండ్సర్ కాజిల్ వేదికగా 2018లో అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగింది. జనవరిలో తమకు ఆర్ధిక స్వాతంత్ర్యం కావాలంటూ రాజ కుటుంబం నుంచి విడిపోయిన ఈ జంట నార్త్ అమెరికాకు మకాం మార్చింది. మార్చి చివరి నాటికి అధికారికంగా వీరు రాజకుటుంబం నుంచి వేరుపడతారు.  గతేడాది చివరి నుంచి హ్యారీ, మేఘన్‌లిద్దరూ కెనడాలోని వాంకోవర్ ద్వీపంలో ఉన్నారు. అయితే రాజకుటుంబం నుంచి వేరుపడిన తర్వాత ఈ దంపతులకు తాము భద్రతా ఖర్చులు చెల్లించబోమని గత నెలలో కెనడా ప్రభుత్వం పేర్కొంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం అదే తరహాలో స్పందించడం గమనార్హం. 

Updated Date - 2020-03-30T17:51:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising