ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గెలుపు కోసం ట్రంప్ పరుగులు.. ఆదరాబాదరాగా ర్యాలీలు!

ABN, First Publish Date - 2020-11-03T16:11:49+05:30

అగ్రరాజ్యంలో ఎన్నికల సమయం చాలా దగ్గర్లోకి వచ్చేసింది. అధ్యక్ష అభ్యర్థులిద్దరూ తమ ప్రచారం చివరి దశలో ఉన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అగ్రరాజ్యంలో ఎన్నికల సమయం చాలా దగ్గర్లోకి వచ్చేసింది. అధ్యక్ష అభ్యర్థులిద్దరూ తమ ప్రచారం చివరి దశలో ఉన్నారు. ఈ క్రమంలో ఇద్దరూ కీలకమైన ప్రాంతాల్లో పర్యటిస్తూ, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఓటర్లను ఆకర్షించేందుకు పరుగులు పెడుతున్నారు. రెండుపార్టీల మధ్య గట్టిపోటీ ఉన్న ప్రాంతాల్లో ఆదరాబాదరాగా ఆదివారం ర్యాలీలు నిర్వహించారు. అర్థరాత్రి వరకూ ఆయన ఇదే పనిలో ఉన్నారంటే ట్రంప్ ఎంత టెన్షన్ పడుతున్నారో తెలిసిపోతుంది. మునుపెన్నడూ లేని విధంగా రాత్రి 11గంటలకు ఫ్లోరిడాలో ట్రంప్ ర్యాలీ నిర్వహించారు.


అమెరికా అధ్యక్ష ఎన్నికలు చరిత్రలో ఎన్నడూ లేనంత హోరాహోరీగా మరాయి. డొనాల్డ్ ట్రంప్, జోబైడెన్ మధ్య గట్టిపోటీ నెలకొంది. అమెరికా మొత్తం రెండుగా విడిపోయిందా? అన్నట్లుంది పరిస్థితి. ఈ క్రమంలో ఆదివారం కూడా ఇద్దరు నేతలూ తమ ప్రచారంలో మునిగిపోయారు. అయితే బైడెన్ ప్రచారం సాధారణంగానే సాగింది, ఉదయాన్నే భార్యతో కలిసి చర్చికి వెళ్లిన ఆయన.. ఎన్నికల్లో కీలకమైన పెన్సిల్వేనియాలోనే తన రోజును గడిపేశారు. ఇక్కడి ఫిలడెల్ఫియాలో ఆయన రెండు ఈవెంట్లు ప్లాన్ చేసుకున్నారు.



ట్రంప్ మాత్రం ఆదివారాన్ని హడావుడిగా గడిపారు. ఎన్నికల సర్వేల్లో బైడెన్‌ లీడ్‌లో ఉన్నట్లు వెల్లడవడంతో ట్రంప్ కాలు నిలవనట్లుంది. ఆదివారం ఒక్కరోజే ఫలితంపై ఉత్కంఠ నెలకొన్న ఐదు రాష్ట్రాల్లో పర్యటించారు. వెళ్లిన ప్రతిచోటా ‘‘మనమే గెలుస్తాం. మనమే లీడ్‌లో ఉన్నాం’’ అంటూ ప్రకటించారు. ‘‘ఫ్లోరిడా, జార్జియాల్లో మనమే ముందంజలో ఉన్నాం. టెక్సాస్‌లో చెప్పలేమని సర్వేలు అంటున్నాయి. చివరిసారి కూడా సర్వేలు ఇలానే వచ్చాయి. కానీ నేను భారీ మెజార్టీతో గెలిచా’’ అంటూ ట్రంప్ చెప్పారు.


గజగజలాడే చలిలో మంచు కురుస్తుండగా ట్రంప్ ర్యాలీల్లో పాల్గొన్నారు. గజగజ వణుకుతూ అభిమానులతో జోకులు పేల్చారు. ఎక్కడా ఆగకుండా ఒకదాని తర్వాత ఒకటిగా ముఖ్యమైన రాష్ట్రాల్లో పర్యటనలు చేశారు. 47 ఏళ్లపాటు అమెరికన్ల రక్తం త్యాగం చేసి, ఇతర దేశాలకు బైడెన్ మేలు చేశాడని ట్రంప్ ఆరోపించారు. అదే సమయంలో బైడెన్ మాత్రం చాలా ప్రశాంతంగా కీలకమైన పెన్సిల్వేనియాలోనే ఉన్నారు.  ఇక్కడ ఓ మీటింగులో మాట్లాడిన ఆయన.. వారంరోజులుగా అమెరికాలో సంభవిస్తున్న కరోనా మరణాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘కరోనా విషయంలో ట్రంప్ ప్రభుత్వ పనితీరు దాదాపు క్రిమినల్ చర్యే’’ అంటూ విమర్శించారు.



సోమవారం నాడు ఇద్దరు నేతలు పెన్సిల్వేనియాలోనే ర్యాలీలు నిర్వహించారు. ఇక్కడ 2016లో ఒకటి కన్నా తక్కువ శాతం ఓట్ల తేడాతో ట్రంప్ గెలిచారు. ఇక్కడ మీటింగ్ తర్వాత ట్రంప్ మిచిగాన్‌కు వెళ్లారు. బైడెన్ ఓహియో వెళ్లారు. అయితే ఎన్నికల్లో స్పష్టమైన విజేత ఎవరో తేలకుంటే దేశంలో అలజడి రేగుతుందని ట్రంప్ హెచ్చరించారు. ఎన్నికల్లో ఎక్కువగా నమోదయ్యే మెయిల్-ఇన్-బ్యాలెట్స్‌లో మోసం జరిగే అవకాశం ఉందని ఆరోపించారు. అయితే ఆయన వ్యాఖ్యలు నిరాధారమైనవని నిపుణులు అంటున్నారు. 


అమెరికాలో ఎప్పుడూ లేనంతగా ఓటర్లు ఎన్నికల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఎలక్షన్లలో 93 మిలియన్ల ముందస్తు ఓట్లు పడినట్లు యూఎస్ ఎలెక్షన్ ప్రాజెక్టు చెప్తోంది. ప్రచారంలో రిపబ్లికన్, డెమొక్రటిక్ రెండు పార్టీలు కాన్ఫిడెన్స్‌గానే కనిపిస్తున్నాయి. చివరి ఎన్నికల్లో నల్లజాతీయులు తక్కువగా ఓట్లు వేశారు. ఈ సమస్యను ఎదుర్కోవడం కోసం బైడెన్.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను రంగంలోకి దింపారు. బైడెన్ తరఫున కొన్ని ప్రాంతాల్లో ఒబామా ప్రచారం కూడా చేశారు. మరి వీరి ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో? ఎన్నికల్లో విజేతలుగా నిలిచి వైట్‌హౌస్‌లో చేరేదెవరో తెలియాలంటే ఫలితాలు వచ్చే వరకూ ఆగాల్సిందే.

Updated Date - 2020-11-03T16:11:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising