ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంబైలో భారీ టీఆర్‌పీ స్కాం

ABN, First Publish Date - 2020-10-09T08:40:48+05:30

ముంబైలో టెలివిజన్‌ రేటింగ్‌ పాయింట్ల (టీఆర్‌పీ) స్కాంను పోలీసులు బట్టబయలు చేశారు. టీఆర్‌పీలను పెంచుకునేందుకు ఇంగ్లిష్‌ న్యూస్‌ చానెల్‌ రిపబ్లిక్‌ టీవీ, మరో రెండు మరాఠీ చానెళ్లు అడ్డదార్లు తొక్కాయని పోలీసులు వెల్లడించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రిపబ్లిక్‌ టీవీ, మరో 2 మరాఠీ చానెళ్ల బండారం బట్టబయలు
  • డబ్బులిచ్చి మీటర్లను టాంపరింగ్‌ చేసే యత్నం

ముంబై, అక్టోబరు 8: ముంబైలో టెలివిజన్‌ రేటింగ్‌ పాయింట్ల (టీఆర్‌పీ) స్కాంను పోలీసులు బట్టబయలు చేశారు. టీఆర్‌పీలను పెంచుకునేందుకు ఇంగ్లిష్‌ న్యూస్‌ చానెల్‌ రిపబ్లిక్‌ టీవీ, మరో రెండు మరాఠీ చానెళ్లు అడ్డదార్లు తొక్కాయని పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించి మరాఠీ చానెళ్ల సీనియర్‌ అధికారులను అరెస్ట్‌ చేశారు. సుప్రసిద్ధ జర్నలిస్టు, న్యూస్‌ ప్రజెంటర్‌ అయిన అర్నబ్‌ గోస్వామి చీఫ్‌ ఎడిటర్‌గా ఉన్న రిపబ్లిక్‌ టీవీకి చెందిన వారినెవరినీ ఇంకా అదుపులోకి తీసుకోలేదు. టీవీ రేటింగ్‌లను నిర్ణయించే బార్క్‌ (బ్రాడ్‌కాస్ట్‌ ఆడియెన్స్‌ రిసెర్చ్‌ కౌన్సిల్‌) తరఫున మీటర్ల మానిటరింగ్‌ కాంట్రాక్ట్‌ తీసుకున్న హంస అనే ఏజెన్సీ  ఫిర్యాదు మేరకు పోలీసులు  దర్యాప్తు చేపట్టారని,  హంస ఏజెన్సీలో పనిచేసి మానేసిన సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నామని ముంబై పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌వీర్‌ సింగ్‌ గురువారంనాడు మీడియాకు చెప్పారు. ఈ చానెళ్లు ముంబై నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజల ఇళ్లల్లో  బార్క్‌ నెలకొల్పిన బేరోమీటర్లను టాంపరింగ్‌ చేయడానికి ప్రయత్నించినట్లు స్పష్టంగా రుజువైందని సీపీ తెలిపారు. ఆ నివాసాల్లో ఉండేవారికి డబ్బులిచ్చి -వారు తమ చానెల్‌నే నిరంతరం ఆన్‌చేసి ఉంచేలా రిపబ్లిక్‌ టీవీ, ఇతర మరాఠీ చానెళ్లు ఒప్పందానికి వచ్చాయని ఆయన పేర్కొన్నారు.  అయితే అర్నబ్‌ గోస్వామి మాత్రం తమ చానెల్‌పై వచ్చిన ఆరోపణలను ఖండించారు. రిపబ్లిక్‌ టీవీని మహారాష్ట్ర ప్రభుత్వం బద్నాం చేస్తోందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు.


ఏమిటీ టీఆర్‌పీ..?

టీవీ ప్రేక్షకుల అభిరుచులను, వివిధ కార్యక్రమాలపై వారి ఆదరణను అంచనా వేసి, వాటి ఆధారంగా చానెళ్ల రేటింగ్‌ను నిర్ణయించేదే టీఆర్‌పీ. ఏ కార్యక్రమాన్ని లేక ఏ బ్రేకింగ్‌ న్యూస్‌ను వీక్షకులు ఎక్కువ  సేపు చూశారు, ఏ చానెల్‌ను రోజులో ఎక్కువ సేపు చూస్తున్నారు, ఏ టైమ్‌లో అంటే ప్రైమ్‌ టైమ్‌లోనా లేక నాన్‌ ప్రైమ్‌ టైమ్‌ల్లోనా అన్న సాధారణ ప్రాతిపదికన ఈ రేటింగ్‌ ఇస్తారు. ఇందుకు అనేక  నివాసాల్లో మీటర్లను పెడతారు. టెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్‌) మార్గదర్శకాలను అనుసరించి  బ్రాడ్‌కాస్ట్‌ ఆడియెన్స్‌ రిసెర్చ్‌ కౌన్సిల్‌ (బార్క్‌) ఈ రేటింగ్‌లను ఇస్తుంది. 


Updated Date - 2020-10-09T08:40:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising