ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జర్నలిస్టులకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా ప్రకటించిన త్రిపుర ప్రభుత్వం

ABN, First Publish Date - 2020-12-22T05:06:35+05:30

జర్నలిస్టులకు ఏడాదికి రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించనున్నట్టు త్రిపుర ప్రభుత్వం ప్రకటించింది. ఆయుష్మాన్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అగర్తాలా: జర్నలిస్టులకు ఏడాదికి రూ.5 లక్షల  ఆరోగ్య బీమా అందించనున్నట్టు త్రిపుర ప్రభుత్వం ప్రకటించింది. ఆయుష్మాన్ త్రిపుర పథకం కింద జర్నలిస్టులకు లబ్ధి చేేకూర్చుతామని ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ వెల్లడించారు. అగర్తాలాలో సోమవారం జరిగిన ఫోరమ్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ మీడియా కమ్యునిటీ (ఎఫ్‌డీపీఎంసీ) తొలి రాష్ట్రస్థాయి సమావేశంలో సీఎం దేబ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘తక్కువ ఆదాయం కలిగిన జర్నలిస్టుల జాబితాను రూపొందించాలని ఎఫ్‌డీపీఎంసీని కోరుతున్నాను. వారి జీవనోపాధి అవకాశాలను మెరుగు పర్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తుంది...’’ అని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ప్రకటనతో తమ ‘‘చిరకాల కోరిక’’ నెరవేరిందని ఎఫ్‌డీపీఎంసీ జనరత్ సెక్రటరీ సేబక్ భట్టాచార్య హర్షం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-12-22T05:06:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising