ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో 2 వేలకు చేరువైన కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-04-02T18:20:15+05:30

దేశవ్యాప్తంగా కోవిడ్-19 పాజిటివ్ కేసు సంఖ్య 1965కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఇవాళ వెల్లడించింది. ఈ మహమ్మారి కారణంగా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: దేశవ్యాప్తంగా కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 1965కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 50 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. కాగా ప్రస్తుతం కరోనా చికిత్స పొందుతున్న వారి సంఖ్య 1764గా ఉండగా... 150 మంది ఈ వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్రం పేర్కొంది.  గురువారం ఉదయం అందిన వివరాల మేరకు కొత్తగా ఇవాళ తొమ్మిది కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర నుంచి నలుగురు, మధ్య ప్రదేశ్ నుంచి ముగ్గురు, ఆంధ్ర ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి ఒక్కరేసి చొప్పున కొత్త కేసులు వెలుగుచూశాయి. కాగా గుజరాత్ (6) తర్వాత అత్యధిక కరోనా మరణాలు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర (13) నిలిచింది. మధ్య ప్రదేశ్‌లో ఆరుగురు, పంజాబ్‌లో నలుగురు, కర్నాటక, తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో ముగ్గురేసి చొప్పున కరోనాతో మృతి చెందారు. కాగా ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, ఉత్తర ప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో ఇద్దరేసి చొప్పున కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోగా... ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, బీహార్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కరేసి చొప్పున మృతి చెందారు.


కాగా ఇప్పటి వరకు అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర (335) మొదటి స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో కేరళ (265), తమిళనాడు (234) రాష్ట్రాలు ఉన్నాయి. మరోవైపు ఢిల్లీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 152కు చేరింది. ఉత్తర ప్రదేశ్‌లో 113, కర్నాటకలో 110, తెలంగాణలో 96, రాజస్థాన్‌లో 108, మధ్య ప్రదేశ్‌లో 99, ఆంధ్ర ప్రదేశ్‌లో 86, గుజరాత్‌లో 82, జమ్మూ కశ్మీర్‌లో 62 మంది కరోనా రోగులు ఉన్నారు. పంజాబ్‌లో 46 కరోనా కేసులు నమోదు కాగా.. హర్యానాలో 43, పశ్చిమబెంగాల్లో 37, బీహార్‌లో 23, చండీగఢ్‌లో 16, లద్దాక్‌లో 13 కేసులు నమోదయ్యాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా పది కేసులు వెలుగుచూడగా.. ఛత్తీస్‌గఢ్‌లో 9, ఉత్తరాఖండ్‌లో 7 కేసులు నమోదయ్యాయి. ప్రముఖ పర్యాటక ప్రాంతం గోవాలో 5 కేసులు నమోదు కాగా.. ఒడిశాలో 4, పుదుచ్చేరి, హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ముగ్గురేసి చొప్పున కోవిడ్-19 బారిన పడ్డారు. అసోం, జార్ఖండ్, పుదుచ్చేరి, మిజోరాం, మణిపూర్ రాష్ట్రాల్లో ఒక్కో కరోనా కేసు నమోదైంది. 

Updated Date - 2020-04-02T18:20:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising