ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం

ABN, First Publish Date - 2020-06-07T15:53:05+05:30

బంగాళాఖాతంలో ఈనెల 8న మరో అల్పపీడనం ఏర్పడనుందని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: బంగాళాఖాతంలో ఈనెల 8న మరో అల్పపీడనం ఏర్పడనుందని, ఇది తుపానుగా మారితే నైరుతి రుతుపవనాలు తీవ్రరూపం దాలుస్తాయని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు తెలిపారు. కేంద్ర పశ్చిమ బంగాళాఖాతం తూర్పు ప్రాంతంలో ఏర్పడనున్న అల్పపీడనం తుపానుగా మారి ఒడిశా వైపు పయనించే అవకాశముందని, దీని కారణంగా ఒడిశాతో పాటు పలు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవన వర్షాలు కురుస్తాయని వారు తెలిపారు. 


నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా 9 శాతం రుతుపవన వర్షాలు కురిశాయని, రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు, ఉష్ణచలనం కారణంగా పశ్చిమ కనుమలను ఆనుకొని ఉన్న జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, చెన్నై, కాంచీపురం, తిరువళ్లూర్‌, వేలూరు, తంజావూరు, తిరువారూరు, నాగపట్టణం, సేలం, ధర్మపురి, కృష్ణగిరి, తిరునల్వేలి, కన్నియకుమారి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్‌ సముద్ర ప్రాంతంలో గంటకు 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తుండడంతో జాలర్లు ఆ ప్రాంతాలకు వెళ్లరాదని వారు సూచించారు.

Updated Date - 2020-06-07T15:53:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising