ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫేస్‌బుక్ మమ్మల్ని కాపీ కొట్టింది: టిక్‌టాక్

ABN, First Publish Date - 2020-08-03T17:53:54+05:30

టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ ఫేస్‌బుక్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ఫేస్‌బుక్ టిక్‌టాక్‌ను కాపీ కొట్టిందని, సంస్థను అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేసిందని ఆరోపించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ ఫేస్‌బుక్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ఫేస్‌బుక్ టిక్‌టాక్‌ను కాపీ కొట్టిందని, సంస్థను అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా ప్రజలను ఉద్దేశించి ఇటీవల విడుదల చేసిన ప్రకటనలో ఈ వ్యాఖ్యాలు చేసింది. ప్రపంచ స్థాయి కంపెనీగా ఎదిగేందుకు తాము కట్టుబడి ఉన్నామని సంస్థ స్పష్టం చేసింది. అయితే ఎదిగే క్రమంలో తాము ఎవ్వరూ ఊహించలేని ఎన్నో సంక్లిష్టమైన ఇబ్బందులను ఎదుర్కొన్నామని తెలిపింది. అంతర్జాతీయ పరిణామాలు తీసుకొస్తున్న ఒత్తిడి, భిన్నసంస్కృతుల మధ్య భేదాలు వంటివాటిని తన ప్రకటనలో పేర్కొంది. అదే సమయంలో..ప్రత్యర్థి అయిన ఫేస్‌బుక్ తమను కాపీ కొట్టేందుకు ప్రయత్నించిందని కూడా ఆరోపించింది. అయితే ఏయే అంశాల విషయంలో ఈ అనుకరణ జరిగిందనేది మాత్రం స్పష్టం చేయలేదు. టిక్‌టాక్ కోనుగులుపై చర్చలకు కట్టుబడి ఉన్నామన్న మైక్రోసాఫ్ట్ స్టేట్‌మెంట్‌కు కొద్ది సేపటి ముందు..బైట్‌డ్యాన్స్ చైనా భాషలో ఈ ప్రకటన విడుదల చేసింది. 


Updated Date - 2020-08-03T17:53:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising