ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారతీయుల డాటాను సింగపూర్‌లో దాచాం: టిక్‌టాక్

ABN, First Publish Date - 2020-07-05T00:46:15+05:30

జాతీయ భద్రత, ప్రాదేశిక సమగ్రత వంటి అంశాల దృష్ట్యా భారత్ చైనా సంస్థలకు చెందిన యాప్‌లపై నిషేధం విధించింది. అదే సమయంలో..తగు వివరణ ఇచ్చేందుకు ఆయా సంస్థలకు గుడువు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో బ్యాన్ కారణంగా భారీగా నష్టపోయిన టిక్‌టాక్.. తాజాగా ప్రభుత్వానికి ఓ లేఖ రాసినట్టు తెలిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: జాతీయ భద్రత, ప్రాదేశిక సమగ్రత వంటి అంశాల దృష్ట్యా భారత్ చైనా సంస్థలకు చెందిన యాప్‌లపై నిషేధం విధించింది. అదే సమయంలో..తగు వివరణ ఇచ్చేందుకు ఆయా సంస్థలకు గడువు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో బ్యాన్ కారణంగా భారీగా నష్టపోయిన టిక్‌టాక్.. తాజాగా ప్రభుత్వానికి ఓ లేఖ రాసినట్టు తెలిసింది. జూన్ 28న టిక్‌టాక్ సీఈఓ కెవిన్ మాయర్ లేఖ ద్వారా ప్రభుత్వాన్ని సంప్రదించారట. ఇందులో ఆయన.. చైనా ప్రభుత్వం తమ నుంచి టిక్ టాక్ వినియోగదారుల సమాచారం కోరలేదని స్పష్టం చేశారట. అంతే కాకుండా.. చైనా ప్రభుత్వం ఇలా అడిగినా కూడా తాము సమాచారాన్ని ఇచ్చే ప్రసక్తే ఉండదని చెబుతూ.. చైనా‌కు దూరం జరిగే ప్రయత్నం చేశారట. ప్రస్తుతం టిక్‌టాక్ వినియోగదారుల సమాచారం సింగపూర్‌లోని సర్వర్‌లలో ఉందని, భవిష్యత్తులో భారత్‌లోనూ డాటా సెంటర్లను ఏర్పాటు చేస్తామని కూడా పేర్కొన్నారట. అయితే ప్రభుత్వం ఈ బ్యాన్‌ను అంత తొందరగా ఉపసంహరించుకోదని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. జాతియ భద్రతతో ముడిపడిన అంశం కావడంతో.. ఈ విషయమై టిక్‌టాక్‌కు చట్టపరమైన ఊరట లభించడం కూడా అంత సులువుగా కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Updated Date - 2020-07-05T00:46:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising