ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా పోరుకు 2వేల కోట్ల విరాళం.. ప్రకటించిన టిక్‌టాక్

ABN, First Publish Date - 2020-04-11T04:26:11+05:30

ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం టిక్‌టాక్.. కరోనాపై జరుగుతున్న పోరాటానికి భారీ విరాళం ప్రకటించింది. కరోనాతో పోరాడటానికి 250 మిలియన్ డాలర్లు(సుమారు రూ.2వేల కోట్లు) విరాళం అందజేస్తున్నట్లు ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం టిక్‌టాక్.. కరోనాపై జరుగుతున్న పోరాటానికి భారీ విరాళం ప్రకటించింది. కరోనాతో పోరాడటానికి 250 మిలియన్ డాలర్లు(సుమారు రూ.2వేల కోట్లు) విరాళం అందజేస్తున్నట్లు ప్రకటించింది. కరోనాతో పోరాటంలో ముందు నిలబడిన ఆరోగ్యసిబ్బంది, ఎడ్యుకేటర్లు, కరోనా వల్ల నష్టపోతున్న స్థానిక సంస్థలకు చేయూత కోసమే ఈ మొత్తాన్ని ఇస్తున్నట్లు తెలిపింది. ఇదిగాక మరో 25మిలియన్ డాలర్లు(సుమారు రూ.2వందల కోట్లు) పెట్టి హెల్త్ ఆర్గనైజేషన్లకు ప్రచారం కల్పించనుంది. దీని ద్వారా కీలకమైన సమాచారాన్ని అందరికీ అందించవచ్చని పేర్కొంది. అంతేగాక కరోనా ధాటికి కుప్పకూలిపోయి మళ్లీ పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యాపారాలకు కూడా టిక్‌టాక్ అండగా నిలబడుతోంది. దీనికోసం 100 మిలియన్ డాలర్లు(సుమారు రూ.7.6 వందల కోట్లు) ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది.

Updated Date - 2020-04-11T04:26:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising