ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూపార్కులోని పులికి కరోనా వైరస్...ఫస్ట్ కేసు

ABN, First Publish Date - 2020-04-06T12:39:59+05:30

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మొట్టమొదటిసారి నాలుగేళ్ల పులికి సోకింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్ (అమెరికా): ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మొట్టమొదటిసారి నాలుగేళ్ల పులికి సోకింది. అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలోని బ్రోంక్స్ జంతుప్రదర్శనశాలకు చెందిన నదియా అనే నాలుగేళ్ల వయసుగల పులికి కరోనా వైరస్ సోకిందని అమెరికా ఫెడరల్ అధికారులు ప్రకటించారు. జూపార్కులో పనిచేస్తున్న ఉద్యోగి నుంచి పులికి కరోనా వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు. బ్రోంక్స్ జూపార్కులో నదియాతోపాటు మరో ఆరు పులులు, సింహాలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాయి. దీంతో పరీక్షలు చేయగా ఒక్క నదియా పులికే కరోనా సోకిందని తేలింది.మిగతా జంతువులు అనారోగ్యం నుంచి కోలుకున్నాయని అధికారులు చెప్పారు. దీంతో న్యూయార్క్ లోని బ్రోంక్స్ జూపార్కును మార్చి 16వతేదీ నుంచి మూసివేశారు. పెంపుడు జంతువులు, పశువులకు కరోనా వైరస్ సోకడం కొత్త ప్రశ్నలను లేవనెత్తుతుందని జూపార్కు డైరెక్టరు జిమ్ బ్రెహేనీ చెప్పారు.


గతంలో హాకాంగ్ లో పెంపుడు కుక్కకు కరోనా వచ్చిందని బయటపడింది. కరోనా వైరస్ తో బాధపడుతున్న నడియా పులిని ఐసోలేషన్ లో ఉంచి ఇతర జంతువులకు సోకకుండా చూడాలని అమెరికన్ వెటర్నరీ మెడికల్ అసోసియేషన్,ఫెడరల్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పరిశోధకులు జూ అధికారులకు సూచించారు.

Updated Date - 2020-04-06T12:39:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising