ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తరచూ కురుస్తున్న వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ ఉష్ణోగ్రతల్లో తగ్గుదల

ABN, First Publish Date - 2020-06-04T03:03:40+05:30

హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కొద్ది రోజుల నుంచి కురుస్తున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు ఉష్ణోగ్రతలను బాగా తగ్గించాయి. వర్షాలు, ఉరుములతో కూడిన వానలు, వడగళ్ల వానలు తరచూ కురుస్తుండటంతో సాధారణం కన్నా దాదాపు 10 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం నుంచి ఆదివారం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 


సిమ్లాతోపాటు మరికొన్ని చోట్ల బుధవారం మధ్యాహ్నం వడగళ్ళవాన, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. దీంతో సాధారణం కన్నా 5 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. చంబ, డల్హౌసీ వంటి ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 8 నుంచి 10 డిగ్రీల సెల్సియస్ తగ్గిపోయినట్లు పేర్కొంది. 


Updated Date - 2020-06-04T03:03:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising