ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్తరాఖండ్ : అష్ట దిగ్బంధనాన్ని ఉల్లంఘించిన 4 వేల మంది అరెస్ట్

ABN, First Publish Date - 2020-04-09T01:34:12+05:30

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు అమలు చేస్తున్న అష్ట దిగ్బంధనాన్ని ఉల్లంఘించినవారిపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెహ్రాడూన్ : కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు అమలు చేస్తున్న అష్ట దిగ్బంధనాన్ని ఉల్లంఘించినవారిపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఉత్తరాఖండ్ శాంతిభద్రతల విభాగం డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలో ఈ నిబంధనలను ఉల్లంఘించిన 4,071 మందిని, కోవిడ్-19పై బూటకపు వార్తలను ప్రచారం చేస్తున్న 44 మందిని  అరెస్టు చేశారు. మొత్తం 973 కేసులు నమోదయ్యాయి.


ఇద్దరు జమాతీలను బుధవారం అరెస్టు చేసి, సెక్షన్ 307 ప్రకారం కేసు నమోదు చేసినట్లు అశోక్ కుమార్ తెలిపారు. వీరిని తమ ఇళ్ళలో బస చేసేందుకు అనుమతించిన నలుగురిపై కూడా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 


ఢిల్లీలోని తబ్లిగి జమాత్ కార్యక్రమాల్లో పాల్గొన్నవారిలో 180 మంది ఉత్తరాఖండ్ డీజీపీ అనిల్ రాటూరి పిలుపు మేరకు మంగళవారం అధికారుల సమక్షానికి వచ్చారని తెలిపారు. 


Updated Date - 2020-04-09T01:34:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising