ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నేపధ్యంలో... కోటీశ్వరులైన ప్రొఫెసర్టు

ABN, First Publish Date - 2020-07-28T01:20:19+05:30

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మరికి డ్రగ్‌ను కనుగొనే క్రమంలో... ముగ్గురు ప్రొఫెసర్లు ఒక్కసారిగా కోటీశ్వరులైపోయారు. వివరాలిలా ఉన్నాయి. బ్రిటన్ లోని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్‌కు చెందిన స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు కరోనా నివారణకు ఓ డ్రగ్‌ను అభివృద్ధి చేశారు. వరాట్కో జుకనోవిచ్, డొన్నా డేవిస్, స్టీఫెన్ హోల్‌గేట్ అనే ముగ్గురు ప్రొఫెసర్లు ఆస్తమా, తీవ్రమైన శ్వాసకోస సంబంధిత వ్యాధులు సంభవించడానికి గల కారణాలపై విస్తృత పరిశోధనలు ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సౌతాంప్టన్ : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మరికి డ్రగ్‌ను కనుగొనే క్రమంలో... ముగ్గురు ప్రొఫెసర్లు ఒక్కసారిగా కోటీశ్వరులైపోయారు. వివరాలిలా ఉన్నాయి. బ్రిటన్ లోని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్‌కు చెందిన స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు కరోనా నివారణకు ఓ డ్రగ్‌ను అభివృద్ధి చేశారు. వరాట్కో జుకనోవిచ్, డొన్నా డేవిస్, స్టీఫెన్ హోల్‌గేట్ అనే ముగ్గురు ప్రొఫెసర్లు ఆస్తమా, తీవ్రమైన శ్వాసకోస సంబంధిత వ్యాధులు సంభవించడానికి గల కారణాలపై విస్తృత పరిశోధనలు ప్రారంభించారు. 


రాట్కో జుకనోవిచ్, డొన్నా డేవిస్, స్టీఫెన్ హోల్‌గేట్ అనే ఈ పరిశోధకులు... సైనర్జీన్ కంపెనీని 2004 లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయించారు. అయితే ప్రముఖ ఫార్మా కంపెనీ ఆస్త్రాజెనెకాతో కలసి ఆస్తమా వల్ల కలిగే వైరల్ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన చికిత్సకు సంబంధించిన డీల్ కుదరక పోవడంతో సైనర్జీన్ కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి.


అయినా... ఈ ముగ్గురూతమ పరిశోధనలు కొనసాగిస్తూ వచ్చారు. కాగా, ప్రస్తుతం కరోనా మహమ్మారి వేళలో శ్వాస సంబంధిత చికిత్సకు డిమాండ్ పెరిగిన నేపధ్యంలో... వీరి పరిశోధనలు మరోమారు వెలుగులోకొచ్చాయి.


ఈ ప్రొఫెసర్లు అభివృద్ది చేసిన డ్రగ్... 79 శాతం మంది తమ శ్వాస సంబంధిత సమస్యల నుంచి బయటపడ్డారు. ఈ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన వివరాలను గత వారం వెల్లడించారు. ఈ వివరాలను సైనర్జీన్ కంపెనీ సీఈవో రిచర్డ్ మార్స్‌డెన్ బయటపెట్టారు. ఈ ఫలితాల వివరాలు ఈ నెల 21 న బయటకు రాగానే కంపెనీ షేర్లు భారీగా పెరిగాయి. మధ్యాహ్నం కల్లా 540 శాతం మేరకు షేరు ధర పెరగడం విశేషం. జుకనోవిచ్‌కు ఉన్న షేర్ల విలువ 3 లక్షల పౌండ్ల నుంచి 1.6 మిలియన్ పౌండ్లకు, హోల్‌గేట్, డేవీస్ షేర్ల విలువ 1.7 మిలియన్ పౌండ్లకు పెరిగాయి.


ఈ ఏడాది సైనర్జీన్ షేర్ల విలువ 3 వేల శాతం మేర పెరగడం గమనార్హం. వీరితో పాటు ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వాళ్లు, డైరెక్టర్లు కూడా భారీగా లబ్ది పొందారు. ఈ డ్రగ్ గురించి కంపెనీ సీఈవో మాట్లాడుతూ ‘కరోనా వైరస్ కారణంగా ఆర్థికంగా కూడా చాలా మంది నష్ట పోయారు. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎంతో నష్టం జరుగుతుంది. మేము తయారు చేసిన డ్రగ్ ప్రస్తుతం సత్ఫలితాలనే ఇస్తున్నది. ఇది కనుక 100 శాతం వ్యాధిని నయం చేయగలిగితే మా సంస్థకే కాక ప్రపంచానికే ఒక ఆశాకిరణంగా మారుతంది’ అని అన్నారు.


ప్రస్తుతం సైనర్జీన్ సంస్థ పరిశోధనలు కేవలం సౌతాంప్టన్ జనరల్ ఆసుపత్రికే పరిమితమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా క్లినికల్ ట్రయల్స్ చేయడానికి సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది. అవి కూడా విజయవంతమైతే మార్కెట్లోకి ఈ డ్రగ్ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.

Updated Date - 2020-07-28T01:20:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising