ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐటీ రిటర్న్‌ల దాఖలుకు గడువును పెంచడం ఇది నాలుగోసారి...

ABN, First Publish Date - 2020-10-01T22:53:57+05:30

కరోనా నేపథ్యంలో ‘2019-20 ఆర్థిక అసెస్‌మెంట్’ సంవత్సరానికి సంబంధించి... ఆదాయ పన్ను రిటర్న్‌ల దాఖలుకు గడువును నవంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) నిన్న(బుధవారం) వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి 31 తో ముగిసిన 20190-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్స్ దాఖలుకు గడువును సీబీడీటీ గతంలో జూన్ 30 వ తేదీకి గతంలో పొడిగించింది. కరోనా వైరస్ నేపథ్యంలో గడువును పొడిగించింది. మొదటిసారి జూలై 31 వరకు, రెండోసారి సెప్టెంబర్ 30 వరు పొడిగించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కరోనా నేపథ్యంలో ‘2019-20 ఆర్థిక అసెస్‌మెంట్’ సంవత్సరానికి సంబంధించి... ఆదాయ పన్ను రిటర్న్‌ల దాఖలుకు గడువును నవంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) నిన్న(బుధవారం) వెల్లడించిన విషయం తెలిసిందే.


ఈ ఏడాది మార్చి 31 తో ముగిసిన 20190-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్స్ దాఖలుకు గడువును సీబీడీటీ గతంలో జూన్ 30 వ తేదీకి గతంలో పొడిగించింది. కరోనా వైరస్ నేపథ్యంలో గడువును పొడిగించింది. మొదటిసారి జూలై 31 వరకు, రెండోసారి సెప్టెంబర్ 30 వరు పొడిగించారు.


ఇప్పుడు ఈ గడువును... గడువును నవంబర్ 30 వరకు పొడిగించారు. కాగాి... రిటర్న్స్ ఫైలింగ్ చేయని వారి నగదు ఉపసంహరణల విషయంలో ఆదాయపుపన్ను శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు ఐటీ విభాగం వివిధ మార్గాల్లో ఊరట కల్పిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2018-19 అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించి పన్ను రిటర్న్స్ దాఖలుకు గడువును రెండు నెలలపాటు పొడిగించి... నవంబర్ 30 వరకు అవకాశం కల్పించింది.


కరోనా నేపథ్యంలో... పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటోన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీడీటీ వెల్లడించింది. కాగా... 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఒరిజినల్, సవరించిన ఐటీఆర్ ల దాఖలు విషయంలో పన్ను చెల్లింపులకుగాను గడువును పొడిగించడం ఇది నాలుగోసారి.


Updated Date - 2020-10-01T22:53:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising