ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ నెల కూడా నిరాశే..!

ABN, First Publish Date - 2020-10-28T16:52:20+05:30

తిరువణ్ణామలైలో ప్రతి నెలా పౌర్ణమి రోజున లక్షలాది మంది గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా మార్చి నుంచి అన్నామలైయార్‌ గిరి ప్రదక్షిణపై నిషేధం విధించారు. అనంతరం లాక్‌డౌన్‌ సడలింపులతో గత నెల 1వ తేది నుంచి భక్తులు ఆలయానికి వెళ్లి స్వామి దర్శనం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : తిరువణ్ణామలైలో ప్రతి నెలా పౌర్ణమి రోజున లక్షలాది మంది గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా మార్చి నుంచి అన్నామలైయార్‌ గిరి ప్రదక్షిణపై నిషేధం విధించారు. అనంతరం లాక్‌డౌన్‌ సడలింపులతో గత నెల 1వ తేది నుంచి భక్తులు ఆలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల పౌర్ణమి ఘడియలు 30వ తేది సాయంత్రం 6.41 గంటలకు ప్రారంభమై 31వ తేది రాత్రి 8.45 గంటలకు ముగుస్తాయి. ఏడు నెలలుగా గిరి ప్రదక్షిణ చేయలేని భక్తులు ఈ నెలలోనైనా చేయాలని ఆశగా ఉన్నారు. కానీ, కరోనా వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఈ నెల కూడా గిరి ప్రదక్షిణకు అనుమతి లేదని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన తిరువణ్ణామలై కార్తీక దీపోత్సవ వేడుకలు నవంబరు 20 నుంచి ప్రారంభం కానున్నాయి. 10 రోజులు జరుగనున్న ఈ వేడుకల్లో ప్రధానాంశమైన మహా దీపం 29వ తేది నిర్వహించనున్నారు. ఈ రోజైనా గిరి ప్రదక్షిణకు అనుమతిస్తారా అంటూ భక్తులు ఎదురుచూస్తున్నారు.

Updated Date - 2020-10-28T16:52:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising