ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విమర్శించే ముందు ఆలోచించండి

ABN, First Publish Date - 2020-09-19T07:50:50+05:30

తమిళనాడు లో నీట్‌ పరీక్షలకు భయపడి నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై తమిళ సినీనటుడు సూర్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నటుడు సూర్యకు హైకోర్టు ధర్మాసనం హితవు


చెన్నై, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు లో నీట్‌ పరీక్షలకు భయపడి నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై తమిళ సినీనటుడు సూర్య చేసిన వ్యాఖ్యలపై కోర్టు ధిక్కరణ కేసు నమో దు చేయాల్సిన అవసరం లేదని, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. ఇకపై ఆచితూచి విమర్శలు చేయాలంటూ సూర్యకు సూచించింది.


గత ఆదివారం ఆయన జారీచేసిన ఓ ప్రకటనలో కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ప్రాణాలకు భయపడి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తీర్పులు వెలువరిస్తున్న న్యాయమూర్తులు.. విద్యార్థులను భయపడకుండా నీట్‌ పరీక్షలు రాయమంటూ ఉత్తర్వులు జారీ చేయడం గర్హనీయమని పేర్కొన్నారు.


ఆ వ్యాఖ్యలు న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా ఉన్నాయని, సూర్యపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎం.సుబ్రహ్మణ్యం.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏపీ సాహికి లేఖ రాశారు. అయితే సూర్య వ్యాఖ్యలకు మద్దతుగా ఆరుగురు మాజీ న్యాయమూర్తులు కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయొద్దంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు.

Updated Date - 2020-09-19T07:50:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising