ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మతం ఆధారంగా ఎవరిపై వివక్ష లేదు: మోదీ

ABN, First Publish Date - 2020-12-22T17:17:50+05:30

ఇదే కార్యక్రమంలో ఏఎంయూ చాన్స్‌లర్ సైద్న ముఫ్ఫద్దల్ సైఫుద్దిన్ పాల్గొన్నారు. వాస్తవానికి ఈ యూనివర్సిటీ స్థాపించి సెప్టెంబర్ 14వ తేదీతోనే వందేళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ లాక్‌డౌన్ కారణంగా శతాబ్ది ఉత్సవాలు జరపలేకపోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) మినీ ఇండియా అని ఆ యూనివర్సిటీ దేశానికే ఆదర్శమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఏఎంయూ స్థాపించి  100 ఏళ్లైన సందర్భంగా నిర్వహించిన శతాబ్ది మహోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా ఆయనతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ నిషాంక్ గౌరవ అతిథిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో ఏఎంయూ చాన్స్‌లర్ సైద్న ముఫ్ఫద్దల్ సైఫుద్దిన్ పాల్గొన్నారు. వాస్తవానికి ఈ యూనివర్సిటీ స్థాపించి సెప్టెంబర్ 14వ తేదీతోనే వందేళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ లాక్‌డౌన్ కారణంగా శతాబ్ది ఉత్సవాలు జరపలేకపోయారు.


నూరేళ్ల సందర్భాన్ని పురస్కరించుకుని ఏఎంయూపై పోస్టల్ స్టాంప్‌ను ప్రధానమంత్రి విడుదల చేశారు. అనంతరం మోదీ మాట్లాడుతూ ‘‘దేశంలో ఎవరిపై వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. ఆ ప్రాతిపదికనే దేశం ముందుకు కదులుతోంది. ప్రతి వ్యక్తికి రాజ్యంగపరమైన హక్కులు లభిస్తున్నాయి. భవిష్యత్‌పై భరోసాతో దేశం ముందుకు కదులుతోంది. ఈ దేశంలో మతాలకు అతీతంగా ప్రతి వ్యక్తి సమాన అవకాశాలు పొందుతూ, సమాన గౌరవం పొందుతూ తమ కలల్ని నిజం చేసుకుంటున్నారు. ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్’ అనే మంత్రం దీని వెనుక ఉంది’’ అని అన్నారు.

Updated Date - 2020-12-22T17:17:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising