బీజేపీ కంటే పెద్ద దొంగలు లేరు: మమతా బెనర్జీ
ABN, First Publish Date - 2020-12-16T02:15:29+05:30
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ద్వితీయ త్రైమాసికంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో బీజేపీ, టీఎంసీ మధ్య తీవ్రమైన రాజకీయ యుద్ధం జరుగుతోంది. అంతే కాకుండా కొంత కాలంగా
కోల్‌కతా: భారతీయ జనతా పార్టీ నేతల కంటే పెద్ద దొంగలు ఈ దేశంలోనే లేరని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వాళ్లు ప్రజలకు ఇచ్చే వాగ్దానాలకు చేసే పనులకు అసలు సంబంధమే ఉండదని అన్నారు. బెంగాల్‌లోని జల్పయిగురిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మమతా మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు గుప్పించారు.
‘‘ఈ దేశంలో బీజేపీ నేతల కంటే పెద్ద దొంగలు ఎవరూ లేరు. చంబల్ దొంగలకు అర్కెస్ట్రా వాయించడంలో వీళ్లు దిట్టలు. 2014, 2016, 2019లలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ చేసిన వాగ్దానాలను ఎవరు మర్చిపోతారు? ఏడు టీ గార్డెన్లను గుర్తించామని, వాటిని త్వరలోనే పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకువస్తామని ప్రగల్భాలు పలికారు. కానీ వాస్తవంలో జరిగింది ఏమిటి? ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నారు. ఈ మాటలు నమ్మితే కూడా ఏం జరుగుతుందో తెలిసిందే. ప్రజల్ని చీటింగ్ చేయడంలో బీజేపీని మించిన వారు లేరు’’ అని మమతా బెనర్జీ అన్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ద్వితీయ త్రైమాసికంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో బీజేపీ, టీఎంసీ మధ్య తీవ్రమైన రాజకీయ యుద్ధం జరుగుతోంది. అంతే కాకుండా కొంత కాలంగా ఇరు పార్టీ మధ్య నెలకొన్ని పరిస్థితుల దృష్ట్యా ఈసారి ఎన్నికలు చాలా కీలకం కానున్నాయి.
Updated Date - 2020-12-16T02:15:29+05:30 IST