ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సూపర్ స్టార్ పార్టీ ప్రభావాన్ని అంచనా వేయడం తొందరపాటే : కాంగ్రెస్

ABN, First Publish Date - 2020-12-05T21:29:13+05:30

సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీని ఇప్పుడే అంచనా వేయడం తొందరపాటే అవుతుందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. పార్టీ సైద్ధాంతిక పునాది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : వచ్చే ఎన్నికల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ ప్రభావాన్ని అంచనా వేయడం తొందరపాటే అవుతుందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. పార్టీ సైద్ధాంతిక పునాది, నిర్వహణ, ఎన్నికల విషయంలో ఓ స్పష్టతంటూ రాలేదని తమిళనాడు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దినేశ్ గుండూరావ్ అన్నారు. అయితే బీజేపీలోని చాలా మంది నేతలు రజనీకాంత్‌తో టచ్‌లో ఉన్నారని వ్యాఖ్యానించారు. ‘‘రజనీకాంత్ పార్టీ ఇంకా రిజిస్టర్ కాలేదు. సైద్ధాంతిక పునాది ఏంటని ఇంకా వెల్లడి కాలేదు. పార్టీ నిర్మాణాన్ని కూడా వెల్లడించలేదు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతారా? పొత్తు పెట్టుకుంటారా? అన్న దానిపై స్పష్టత లేదు. ఇలాంటి సమయంలో ఆయన పార్టీని అంచనా వేయడం తొందరపాటే’’ అని దినేశ్ గుండూ రావు అన్నారు. 

Updated Date - 2020-12-05T21:29:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising